
కాన్సెప్ట్ పరంగా తెలుగు సినిమా కథలు ప్రపంచ సినిమాతో పోటీపడగలవు అని నిరూపించిన దర్శక ధిక్సూచి సింగీతం శ్రీనివాసరావు గారు. తన నాలుగు దశాబ్దాల కలల ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ చిత్రంతో జూన్ 12న ల్యాండ్ అయ్యాడు. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాపై దాదాపు 22 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంది. సరికొత్త కథాంశంతో, విలక్షణమైన మ్యూజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మిశ్రమ వసూళ్లతో సాగుతోంది.
మొదటి రోజు ఇండియాలో 54 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లతో నెమ్మదిగా ప్రారంభమైంది. అయితే, సినిమాలోని కంటెంట్, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రెండో రోజు వసూళ్లు పుంజుకుని ఏకంగా 1 కోటి రూపాయల నెట్ కలెక్షన్లని సాధించాయి. మూడో రోజు ఆదివారం కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టారు. దీంతో మూడో రోజు కలెక్షన్లు మరింత పెరిగి 1.16 కోట్ల రూపాయలకి చేరాయి. ఇలా మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం ఆశాజనకమైన వసూళ్లని సాధించింది. అయితే సోమవారం నుండి వీక్‌డేస్ ఎఫెక్ట్ ఈ సినిమాపై స్పష్టంగా కనిపించింది. నాలుగో రోజున ఈ చిత్రం 45 లక్షల రూపాయలు, ఐదో రోజున 41 లక్షల రూపాయల నెట్ వసూళ్లను మాత్రమే నమోదు చేసింది. మొత్తంగా మొదటి ఐదు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.76 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్, అలాగే 4.35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లని సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఓ మోస్తరు ఆదరణ లభించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మొదటి రెండు రోజుల్లోనే 57 వేల డాలర్లకు పైగా అంటే సుమారు 55 లక్షల రూపాయలు వసూలు చేసింది. నాలుగో రోజున అక్కడ 24 వేల డాలర్లు అంటే సుమారు 22.7 లక్షల రూపాయలు వచ్చాయి. యూకే, యూరప్, గల్ఫ్, ఆస్ట్రేలియా మరియు మిడిల్ ఈస్ట్ మార్కెట్ల నుండి మరో 20 లక్షల రూపాయల గ్రాస్ రావడంతో ఓవర్సీస్ మొత్తం వసూళ్లు 1 కోటి రూపాయల మార్కు దాటాయి. ఇలా ఇండియా గ్రాస్ 4.35 కోట్ల రూపాయలు మరియు ఓవర్సీస్ గ్రాస్ 1 కోటి రూపాయలు కలిపి, 'సింగ్ గీతం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 5.35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
Also read: బాలకృష్ణ, కమల్ హాసన్ మధ్య ఉన్న తేడా ఎంతో తెలుసా!
కుబేరపురం అనే ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో, పర్యావరణ పరిరక్షణ మరియు మానవ స్వార్థం చుట్టూ సాగే ఈ కథలో వింతగా మనుషుల మాటలు పోయి, ప్రతి సంభాషణ పాట రూపంలోనే రావడం ఈ సినిమా ప్రత్యేకత. కొత్త నటీనటులు అయాన్, అహిల్య బమ్రూలతో పాటు షాలినీ కొండెపూడి, శివనారాయణ, బెనర్జీ తమ నటనతో మెప్పించారు





