Home

»

Latest News

ఓటీటీలో మళ్లీ టైగ‌ర్ల‌ గర్జన.. మూడో సీజన్ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే?

Jun 16, 2026 6:30PM

తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. మొదటి రెండు సీజన్ల అద్భుత విజయం తర్వాత, ఇప్పుడు అంతకు మించిన వినోదాన్ని పంచేందుకు మూడో సీజన్ ముస్తాబైంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ లేటెస్ట్ సీజన్ విడుదలకు ముందే ఇండస్ట్రీ వర్గాల కోసం హైదరాబాద్‌లో ఒక గ్రాండ్ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో జరిగిన ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఈవెంట్ సెలబ్రిటీల సందడితో ఎంతో కలర్‌ఫుల్‌గా సాగింది. టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా రాగా.. చైతన్య రావు, వీజే సన్నీ, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, ముక్కు అవినాష్, నిరుపమ్, కిరీటి దామరాజు వంటి పలువురు నటీనటులు విచ్చేసి ఈ సిరీస్‌ను వీక్షించారు.

ప్రీమియర్ ముగిసిన అనంతరం ఈ సిరీస్‌పై సెలబ్రిటీల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్త ఎపిసోడ్లు నవ్వుల పూయించాయని చూసిన వారంతా కొనియాడుతున్నారు. ముఖ్యంగా లీడ్ రోల్స్ పోషించిన ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్యల టైమింగ్.. వారికి జోడీగా నటించిన జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డిల పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఈ మూడో సీజన్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ. ఆయన చేసిన స్పెషల్ క్యామియో రోల్ కథకు మరింత బలాన్ని, ఊహించని ట్విస్టులను ఇచ్చిందని షో చూసిన ప్రముఖులు చెబుతున్నారు. గత సీజన్లలో కేవలం భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవలను చూపించిన మేకర్స్.. ఈసారి కాన్సెప్ట్‌లో కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్‌ను కూడా యాడ్ చేయడం విశేషం. రెండు భిన్నమైన ప్రపంచాల నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నారు.

సక్సెస్‌ఫుల్ మేకర్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేసిన ఈ సిరీస్‌ను శ్రీరామ్ ఎరగం అద్భుతంగా డైరెక్ట్ చేశారు. శివ మేక, సాహితి చింతలపూడి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. వ్యూయర్‌షిప్ పరంగా తెలుగు ఓటీటీ రికార్డులను తిరగరాసిన ఈ ఫ్రాంచైజీ, హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ డ్రామా జూన్ 19 నుండి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com