
ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తనదైన స్టయిల్లో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని తాజాగా విజయ్ రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సౌత్ చిత్ర పరిశ్రమలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఒక మీటింగ్ కి హాజరైన సముద్రఖని(samuthirakani)మాట్లాడుతు తమిళనాడు ప్రజలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. గతంలో తాను ఒక శ్రేయోభిలాషిగా, మంచి స్నేహితుడిగా మాత్రమే కొన్ని సూచనలు చేశాను . వాటిని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజకీయాలు అనేవి రంగుల ప్రపంచమైన సినిమా లాంటివి కావని, ఇక్కడ ప్రతి అడుగు ఎంతో వ్యూహాత్మకంగా ప్రజా క్షేమం వైపు ఉండాలని తాను నమ్మిన మాట వాస్తవమేనని, కానీ విజయ్ ఆ సవాళ్లన్నింటినీ అధిగమించి 100 శాతం నిబద్ధతతో ప్రజల మనసులు గెలుచుకున్నారని కొనియాడారు. అసలు విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ఏం అర్హత ఉందని కొంత మంది అడిగారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకునే వాళ్ళు ప్రజల కోసం ఏం చేసారు. కేవలం స్టార్ డమ్‌ని నమ్ముకోకుండా ప్రజల్లోకి వెళ్లడం వల్లే ఈ రోజు విజయ్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించగలిగారు.
also read: ఒకే మూవీకి అనిరుధ్, థమన్ మ్యూజిక్.. ఏ అగ్ర హీరో మూవీకో తెలుసా!
ముఖ్యంగా తమిళనాడులో గత కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు సినీ గ్లామర్ నుంచి వచ్చి రాజకీయాలను శాసించినవారే. అయితే మారుతున్న కాలంలో, అంటే 2026 నాటి ఆధునిక రాజకీయాల్లో కేవలం సినిమా క్రేజ్ మాత్రమే సరిపోదని సముద్రఖని నొక్కి చెప్పారు. నేటి తరం ఓటర్లు ఎంతో చైతన్యవంతంగా ఉన్నారని, 80 శాతం కంటే ఎక్కువ మంది యువత కేవలం నాయకుడి సిద్ధాంతాలను, వారి ఆచరణాత్మక విధానాలను చూసి మాత్రమే ఓటు వేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ తన సరికొత్త రాజకీయ సైన్యంతో ప్రజా క్షేమం కొరకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారనేది అత్యంత కీలకంగా మారిందని విశ్లేషించారు.




