Home

»

Latest News

Ntr: ఎన్టీఆర్ హీరోయిన్ పదిహేను సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ

Apr 24, 2026 12:33PM

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో కలిసి 'జై చిరంజీవ' లో ఎంటర్ టైన్ మెంట్ ని, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)తో 'అశోక్', 'నరసింహుడు' లో యాక్షన్ మోడ్ ని సమపాళ్లలో జోడించి మెప్పించిన భామ సమీరా రెడ్డి(Sameera Reddy). డాన్స్ లు ఒక రేంజ్ లో చేసి ఆ విషయలో  హీరోలు మరింత ఎలర్ట్ గా ఉండేలా చేయగలదు. బాలీవుడ్ లో కూడా సేమ్ సిట్యువేషన్ ఆఫ్ కంట్రోల్ తో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకి  పూర్తిగా దూరమయ్యారు.ఇప్పుడు మళ్ళీ వెండితెరపై కనిపించబోతున్నారు. అదీ ఒక పవర్‌ఫుల్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రతో రాబోతుండటం విశేషం.

సంజయ్ దత్(Sanjay Dutt)టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న 'ఆఖ్రీ సవాల్'(Aakhri Sawal)లో సమీరా పెర్ఫార్మ్ కి  ఒక ఆస్కారం ఉన్న ఒక సీరియస్ రోల్‌లో కనిపించబోతున్నారు. కథకి ముఖ్యమైన క్యారక్టర్ కూడా. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్న తర్వాత సమీర తన కుటుంబ బాధ్యతలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పులు, ఎదురైన విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని వాటిపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను కేవలం సినిమాలు చేయాలనే ఉద్దేశంతో తిరిగి రావడం లేదు. నటిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఉన్న, సమాజానికి ఏదైనా చెప్పే అర్థవంతమైన క్యారక్టర్ లో చేస్తానని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇప్పడు ఆఖ్రీ సవాల్ తో వస్తుంది.  '2012 లో క్రిష్, రానా ల కృష్ణం వందే జగద్గురుం'లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అంటే మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత తన సత్తా చాటబోతుంది.


Also read: Mrunal Thakur: ప్రియుడి డైరెక్షన్‌లో మృణాల్ ఠాకూర్!.. ప్రియుడు ఎవరో తెలిస్తే నవ్వుకుంటారు 

జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్(Abijith Mohan varang)దర్శకత్వం వహిస్తుండగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అలియాస్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది.   ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణిగా సంజయ్ దత్ కనిపిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com