Home

»

Latest News

ఫేడ‌వుట్ హీరోతో స‌మంత‌!

Mar 16, 2020 6:59PM

 

వ‌రుస‌గా స్త్రీ ప్ర‌ధాన చిత్రాల‌లో న‌టిస్తూ వ‌స్తోన్న స‌మంత తాజాగా ఇంకో లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆ మూవీని 'గేమ్ ఓవ‌ర్' ఫేమ్ అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఈ కాంబినేష‌న్ సినిమాని సోనీ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న‌ది. ప‌రిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్లో ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న‌ది. తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేమంటే ఇందులో హీరో క్యారెక్ట‌ర్‌కు త‌మిళ సీనియ‌ర్ న‌టుడు ప్ర‌శాంత్‌ను సంప్ర‌దిస్తుండ‌టం. 

కెరీర్ మొద‌ట్లో తొలిముద్దు, దొంగ దొంగ‌, జీన్స్‌,  జోడి.. వంటి సినిమాల‌తో బాగా పాపుల‌ర్ అయిన ప్ర‌శాంత్‌.. త‌ర్వాత అజిత్‌, విజ‌య్‌, విక్ర‌మ్ వంటి హీరోల ధాటికి త‌ట్టుకోలేక వెనుక‌బ‌డిపోయాడు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా క‌నిపిస్తున్నాడు. తెలుగులో ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ అన్న‌య్య‌గా 'విన‌య విధేయ రామ' సినిమాలో అత‌ను క‌నిపించాడు. కాగా అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ రూపొందించే సినిమా క‌థ అంతా స‌మంత చేసే పాత్ర చుట్టూనే న‌డుస్తుంద‌ని స‌మాచారం. ఆ త‌ర్వాతే హీరో పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంది. త‌మిళ మీడియా ప్ర‌కారం ప్ర‌శాంత్ వైపు నుంచి ఇంకా అంగీకారం రాలేదు. త్వ‌ర‌లోనే అత‌డి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

కాగా ఇటీవ‌ల విఘ్నేశ్ శివ‌న్ డైరెక్ట్ చేసే త‌మిళ సినిమా నుంచి స‌మంత త‌ప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. త‌న‌కంటే న‌య‌న‌తార‌కే ఆ సినిమాలో ప్రాధాన్యం ఉన్నందునే స‌మంత ఆ ప్రాజెక్టును వ‌దులుకుంద‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. దీనిపై స‌మంత స్పందించ‌లేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com