Home

»

Latest News

చైతూకు స‌మంత‌ బ‌ర్త్‌డే విషెస్ చెప్ప‌లేదు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్‌!

Nov 24, 2021 10:46AM

 

టాలీవుడ్‌లోని అత్యంత పాపుల‌ర్ క‌పుల్స్‌లో నాగ‌చైత‌న్య, స‌మంత క‌పుల్ ఒక‌టి. అయితే అభిమానుల గుండెల‌ను బ‌ద్ద‌లు చేస్తూ ఆ ఇద్ద‌రూ విడిపోయారు. అంత‌దాకా ఒక‌రికి ఒక‌రు అన్న‌ట్లుగా మెలిగిన వారు ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చింద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది. చైతూతో విడిపోయాక అత‌నితో అన్ని ర‌కాల బంధాల‌ను తెంచేసుకోవాల‌ని స‌మంత భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. భార్యాభ‌ర్త‌లుగా విడిపోతున్నామ‌నీ, స్నేహితులుగా కొన‌సాగుతామ‌నీ సోష‌ల్ మీడియా ద్వారా ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు. కానీ వారిమ‌ధ్య స్నేహం కూడా ఇక కొన‌సాగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దీనికి ఆధారంగా నిన్న నాగ‌చైత‌న్య బ‌ర్త్‌డేని స‌మంత ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డాన్ని ఫ్యాన్స్ ప్ర‌స్తావిస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, త‌న‌కు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్‌ను షేర్ చేసుకొనే సామ్‌.. న‌వంబ‌ర్ 23 చైతూ బ‌ర్త్‌డేకి క‌నీసం విషెస్ కూడా చెప్ప‌లేదు. మిగ‌తా అనేక‌మంది సెల‌బ్రిటీలు, ఫ్యాన్స్ చైతూకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల‌తో సోష‌ల్ మీడియాను హోరెత్తించగా, సామ్ మాత్రం దూరం పాటించింది. చైతూ ఫ్యాన్స్ మాత్ర‌మే కాకుండా సామ్ ఫ్యాన్స్ కూడా చైతూకు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్‌డే విషెస్ చెప్తుందేమోన‌ని ఎదురుచూశారు. కానీ ఆమె నుంచి డేట్ మారేదాకా కూడా ఎలాంటి స్పంద‌నా రాలేదు. 

దీంతో చైతూ ఫ్యాన్స్ ప‌లువురు ఆమె ప్ర‌వ‌ర్త‌న‌ను త‌ప్పుప‌డుతున్నారు. భార్యాభ‌ర్త‌లుగా విడిపోవ‌చ్చు గాక‌, ఒక శ్రేయోభిలాషిగానైనా శుభాకాంక్ష‌లు చెప్పొచ్చుక‌దా అని వారంటున్నారు. కానీ చైతూతో బంధం ముగిసిపోయింద‌నీ, అత‌నితో అన్ని ర‌కాలుగా తెగ‌తెంపులు చేసుకోవాల‌ని స‌మంత డిసైడ్ చేసుకోవ‌డంలో త‌ప్పేమీ లేద‌ని ఆమె ఫ్యాన్స్ కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏమో.. ఎవ‌రికి తెలుసు.. సోష‌ల్ మీడియాలో కాకుండా చైతూకు ప‌ర్స‌న‌ల్‌గా ఆమె విషెస్ చెప్పిందేమో!.. అనేవాళ్లూ ఉన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com