
నిన్న థియేటర్స్ లో వచ్చిన సరస్వతి
సినిమా ఎలా ఉంది!
కథ ఏంటి
ఈ విషయంలో వైరల్ గా నిలవడానికి కారణం
సిల్వర్ స్క్రీన్ పై నిన్న 'సర్వస్వతి'(S. saraswathi)మూవీతో ఎంట్రీ ఇచ్చింది 'వరలక్ష్మి శరత్ కుమార్'.(Varalaxmi sarathkumar)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కగా, డైరెక్షన్ సూపర్ గా ఉందనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. నటిగా కూడా ఇంకో మెట్టు పైకి ఎదిగిందని, ప్రకాష్ రాజ్, ప్రియమణి, రాధిక, రంగం ఫేమ్ జీవా. ఓజి కిషోర్ కూడా తమ నటనతో మెస్మరైజ్ చేసారనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి మూవీపై ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి. అవేంటో చూద్దాం.
సరస్వతి మూవీకి బుర్రా సాయి మాధవ్(Saimadhav Burra)'కథ' ని అందించడం జరిగింది. ఈ మేరకు టైటిల్ కార్డులో మేకర్స్ ప్రస్తావించారు. రీసెంట్ గా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తు 'సరస్వతి' నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్క మాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టుగా మార్చేసుకున్నారు. ఒక రంగంగా కథని మానభంగం చేసారు. నాది రివెంజ్ డ్రామా కాదు. నా సోల్, నా కథ వేరని తెలిపాడు. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ తో పాటు మూవీ లవర్స్ లో వైరల్ గా నిలిచాయి. సాయి మాధవ్ ఎన్నో అగ్ర చిత్రాలకి మాటలని అందించాడు. బాలకృష్ణ(Balakrishna),వరలక్ష్మి శరత్ కుమార్ అన్నా చెల్లెళ్లు గా కనపడిన వీర సింహారెడ్డికి సాయిమాధవ్ నే డైలాగ్ రైటర్.
Also read: mension house mallesh movie review: మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ రివ్యూ
సరస్వతి కథ విషయానికి వస్తే సరస్వతిని పదకొండేళ్ల వయసులో ఫిఫ్టీ ఎబోవ్ ఏజ్ ఉన్న ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేస్తారు. సరస్వతి తల్లితండ్రులని కూడా చంపేస్తారు. యుక్త వయసులో పెళ్లి చేసుకున్నాక తన భర్తతో శారీరకంగా కలవడానికి భయపడుతుంది. దీంతో భర్తకి నిజం చెప్పడంతో అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులని చంపమని సరస్వతికి అండగా ఉంటాడు.ఆ ముగ్గుర్ని సరస్వతి చంపేస్తుంది.ఈ కేసులో చట్టం నుంచి తప్పించుకోవడానికి తనకి 'ఫాంటసీ ఫాండ్ డిస్ ఆర్డర్' అనే అరుదైన వ్యాధి ఉందని సరస్వతి నమ్మిస్తుంది. సిన్సియర్ లాయర్ రామానుజాన్ని(ప్రకాష్ రాజ్) కూడా నమ్మించి మర్డర్స్ కేసు లేకుండా చేసుకుంటుంది. ఇక మూవీ టైటిల్ కార్డ్స్ లో కథ విస్తరణ అని వరలక్ష్మి శరత్ కుమార్ పేరు కనిపించడం కొసమెరుపు. చివరి నిమిషంలో ఎస్ సరస్వతి గా పేరు మార్చడం జరిగింది.







