Home

»

Latest News

ధనుష్‌కు జోడీగా 'డ్రాగన్' బ్యూటీ.. క్రేజీ ప్రాజెక్టులో రుక్మిణి వసంత్!

Mar 13, 2026

కోలీవుడ్ స్టార్ ధనుష్(Dhanush) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విఘ్నేష్ రాజా దర్శకత్వంలో 'కర' అనే సినిమా పూర్తి చేశాడు. 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇళయరాజా బయోపిక్, అబ్దుల్ కలాం బయోపిక్ లైన్ లో ఉన్నాయి. అలాగే, 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ తన 56వ సినిమా చేయబోతున్నాడు.

ప్రస్తుతం సాయి పల్లవి, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్లతో నటిస్తున్న ధనుష్, తన తదుపరి సినిమా 'D56' కోసం మరో క్రేజీ హీరోయిన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. 'సప్త సాగరాలు దాటి', 'కాంతార' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్, ధనుష్ సరసన హీరోయిన్‌గా నటించబోతోందట. (Rukmini Vasanth)

తనదైన నటన, అందంతో ఇప్పటికే సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది రుక్మిణి. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'డ్రాగన్', యశ్ తో 'టాక్సిక్' వంటి భారీ సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు ధనుష్‌తో జత కడుతుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. తమిళ్ లో ఇప్పటికే 'ఏస్, మదరాసి' వంటి సినిమాలు చేసింది రుక్మిణి. ఇది ఆమెకు మూడో తమిళ చిత్రం.

Also Read: ఎంజీఆర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన  రాజేంద్రప్రసాద్!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com