
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్ అంటే కొంత మందిలో ఉన్న అర్దాన్ని ఆమడదూరం పారదోలుతూ కీ రోల్ పోషించబోతుందనే విషయం టీజర్ తో అర్ధమవుతుంది.
ఇప్పుడు ఈ భామ మలయాళ చిత్రసీమలోకి ఘనంగా అడుగుపెడుతోంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ సరసన కథానాయికగా రుక్మిణి వసంత్ నటించబోతున్న ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా 'NP51' అనే వర్కింగ్ టైటిల్‌తో మొన్న 9న హైదరాబాద్ మరియు కేరళ వేదికగా పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 2022లో వచ్చి సంచలన విజయాన్ని సాధించిన 'జయ జయ జయ జయ హే' చిత్రానికి సహ రచయితగా వ్యవహరించిన నషిద్ ఫామి ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్, పౌలీ జూనియర్ పిక్చర్స్ మరియు గ్రీన్ రూమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా అజు వర్గీస్, జగదీష్, కలారంజని, అశోకన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో తన మొదటి సినిమాకే ఇటువంటి ప్రతిష్టాత్మక కాంబినేషన్ లభించడం పట్ల రుక్మిణి వసంత్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, క్లాప్‌బోర్డ్ పట్టుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా, అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Also Read: నసీరుద్దీన్ షాపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు
రాకింగ్ స్టార్ యష్ వన్ మాన్ షో టాక్సిక్’ ద్వారా ఈ 26న రుక్మిణి వసంత్ థియేటర్స్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, సుకుమార్ ల 'RC17'లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్‌ని పరిశీలిస్తున్నట్లు టాక్.
Ntr, Rukmini Vasanth, Nivin Pauly, Dragon







