`ఖిలాడి` వైపు అమెజాన్ చూపు?
on May 15, 2021
`క్రాక్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న చిత్రం `ఖిలాడి`. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అతనికి జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు. `యాక్షన్ కింగ్` అర్జున్, అనసూయ, ఉన్ని ముకుందన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. `రాక్షసుడు` వంటి విజయవంతమైన చిత్రం తరువాత రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా.. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా, కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా ఈ నెల 28న విడుదల కావాల్సిన `ఖిలాడి` వాయిదా బాట పట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. `ఖిలాడి`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. `ఖిలాడి` స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తంతో సొంతం చేసుకుందట. అయితే, మొదట థియేటర్స్ లోనే `ఖిలాడి` సందడి ఉంటుందని.. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొద్ది రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. `ఖిలాడి`కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
Also Read