Home

»

Latest News

Rashmi Gautam: ఆ పార్టీకి నా బహిరంగ మద్దతు.. వెల్లడి చేసిన రష్మీ

May 2, 2026 2:33PM

వైసీపీ నాయకులు తమ నిరసనలో భాగంగా తిరుపతి(Tirupati)లో ఎద్దుల బండిపై ఆటోని , దానిపై మరికొంతమంది మనుషులను ఎక్కించి ఎద్దులతో లాగించారు. ఈ దృశ్యాలని చూసి చలించిపోయిన  యాంకర్ రష్మీ గౌతమ్ సదరు ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఆ ఎద్దు పడుతున్న వేదన కంటే మీరు వెయ్యి రెట్లు అధికంగా బాధపడాలి" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీంతో  వైసీపీ మద్దతుదారులు రష్మీని వ్యక్తిగతంగా పలు విషయాల్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.వాళ్ళల్లో ప్రదీప్ చింత అనే వైసిపీ నాయకుడు ఉన్నాడు. అతని విమర్శలపై రష్మీ ఒక పోస్ట్ చేసింది.

సదరు పోస్ట్ లో మన దగ్గర ఉన్న  సమస్య ఏంటంటే ఒక విషయం గురించి మాట్లాడుతుంటే ప్రజలు మరో విషయాన్నీ ముందుకు తెస్తారు. కేవలం పోలికలు తీసుకురావడం తప్ప హీరోని ఆపడానికి ఎవరు ముందు రావడం లేదు. నేను ఏ రాజకీయపార్టీకి, ఏ మతానికి వ్యతిరేకం కాదు. జంతువులపై జరిగే క్రూరత్వానికే వ్యతిరేకం. నా పై ట్రోల్ చేసే వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అవమానాలు నాకేం కొత్త కాదు. కానీ జంతువులపై జరిగే హింస విషయంలో మాత్రం ఎప్పటిలాగానే మాట్లాడుతూనే ఉంటాను. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏ రాజకీయ పార్టీ అయితే జంతువుల సంక్షేమం కోసం పాటుపడుతుందో ఆ పార్టీకి బహిరంగ మద్దతు ఇస్తానని తన పోస్ట్ లో రాసుకొచ్చింది.      

Also read: Trisha: త్రిషకి అవమానం.. షాకింగ్ ట్వీట్ చేసిన స్టార్ హీరోయిన్   


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com