స్త్రీ అందాన్ని వర్ణిస్తూ ఆర్జీవీ రాసిన పాట కన్నారా? విన్నారా?
on May 5, 2021
స్త్రీ అందాన్ని రామ్‌గోపాల్ వర్మ కళ్లు ఎలా చూస్తాయ్? ఆయన హృదయం ఎలా స్పందిస్తుంది? అది పాట రూపంలో వస్తే ఎలా ఉంటుంది? ఆ పాట చూడాలని, ఆ సాహిత్యం వినాలని ఎవరికి అనిపించదు! అయితే ఎప్పుడో పదేళ్ల క్రితమే ఆ పాట వచ్చేసింది. సునీల్ టైటిల్ పాత్రధారిగా ఆర్జీవీ రూపొందించిన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు సినిమాలో ఆ పాట ఉంది. ఆ పాట పేరు.. "ఏవెట్టి పెంచారే అమ్మానాన్న నిన్ను". సినిమాలో ఆదర్శ్ బాలకృష్ణ, సాక్షి గులాటి లపై ఆ పాటను తీశారు. కోటి మ్యూజిక్ అందించిన ఆ పాటను గీతామాధురి, సింహా పాడారు.
ఆ పాటని మార్కెట్లో విడుదల చేసిన రోజు దాన్ని తనే ఎందుకు రాశాడో కూడా వర్మ ఓ ప్రకటనలో తెలిపాడు. ఏ సందర్భంగా ఆ పాట వస్తుందో కూడా చెప్పాడు. "ఈ పాటని ఇంకో గీత రచయిత తోటి రాయించకుండా నేనే రాయడానికి నా కారణం.. నా దృష్టిలో స్త్రీ అందాన్ని నా కన్నా తాదాత్మ్యంగా ఇంకెవ్వరూ చూడరు.. చూడలేరు. ఆ మహోన్నత అందమే ఒక కఠోరమైన రాయిలాంటి నన్ను కూడా ఒక కవిలా మార్చేసింది. ఆ అందాల విందుకు నేను దాసుడినై, ఆ అభినవ దేవతకు ఒక బానిసనై.. స్త్రీని భగవంతుడు సృష్టించిన అత్యంత మహా సృష్టిగా భావించి, ప్రేమించి, గౌరవించి, ఆరాధించి రాసిన పాటే ఈ 'ఏమెట్టి పెంచారే అమ్మానాన్న నిన్ను?'. ఈ నా పాట స్త్రీలందరికీ అంకితం" - ఇదీ ఈ పాట రాయడానికి వర్మ చెప్పిన కారణం.
అన్నింటికీ 'నా ఇష్టం' అనే ఆర్జీవీ తన ఇష్టం వచ్చినట్లు రాసిన ఆ 'గొప్ప' పాట (కొంతమందో, చాలామందో బూతు పాట అన్నారు) సాహిత్యం ఎలా ఉందో చూద్దామా.. చదివి భరించగలిగినవాళ్లు భరించండి.. లేదంటే.. ఆపై మీ ఇష్టం...
సాకీ:
నీయమ్మ
ఆ కళ్లేంటే..
ఆ ముక్కేంటే..
ఆ కాళ్లేంటే..
ఆ నడుమేంటే..
ఏంటే.. ఏంటే..
పల్లవి:
అతడు: ఏవెట్టి పెంచారే అమ్మానాన్న నిన్ను
నన్నిట్టా చంపుతున్నవ్ డే అండ్ నైటు జాను ||ఏవెట్టి||
అవి పెదాలా రసగుల్లాలా.. అది నడుమా ఐసు క్రీమా
నీ ఒంట్లో అణువు అణువు నా ఒంట్లో అణుబాంబై
నీ ఒంట్లో అణువు అణువు నా ఒంట్లో అణుబాంబై
పేల్చేస్తుందే నీ అందం నన్ను
కాల్చేస్తుందే ఈ హాటు సన్ను ||పేల్చేస్తుందే||
ఆమె: నీయబ్బ..
ఏవెట్టి పెంచార్రా అమ్మానాన్న నిన్ను
నన్నిట్టా చంపుతున్నవ్ డే అండ్ నైటు జాను ||ఏవెట్టి||
అవి కండలా.. రాతి బండలా
అది నడకా.. సూపర్ స్టైలా
నీ కంటి ఆ చూపే నా ఒంటికి యమషాకై ||నీ కంటి||
ఉడికిస్తుంద్రా నా బాడీ పార్ట్లు
అనిపిస్తుంద్రా ఒళ్లంతా స్వీట్లు ||ఉడికిస్తుంద్రా||
చరణం 1:
అతడు: జెన్నిఫర్ మడొన్నాని మిక్సింగ్ చేసి వాడు
నిన్నిట్టా భూలోకానికి చేసాడేమె లోడు
ఆమె: షారుఖ్‌కి హృతిక్‌కి షేకిచ్చేసి వీడు
వండర్‌గా నాకె ఏదో టెండర్ పెట్టేసాడు
అతడు: వై2కె వైరస్లాగ వ్యాపించావె ఒళ్లంతా
ఆమె: పిచ్చిట్టా పట్టేలాగ ఏదో చేసేసావిట్టా
అతడు: ఐ డోంట్ నో వాట్ టు డు బేబీ.. ||ఏవెట్టి||
చరణం 2:
ఆమె: మహేషుబాబుని కూడా ఛీఛీ పో అన్నాను
నీ హైటు స్మార్టు చూసి నీ వల్లో పడ్డాను
అతడు: ఐపీఎల్ ఛీర్ గర్ల్‌లా వుంటుందే నీ మేను
ఒంపుల్తో క్రికెట్ ఆడేస్తున్నావే నన్ను
ఆమె: మేగ్నెట్లా నిన్నంటి వుంటారా రోజంతా
అతడు: చిక్లెట్లా నమిలేస్తా నీ బుగ్గల్ని రాత్రంతా
ఆమె: నౌ యు నో వాట్ టు డు బేబీ
అతడు: ||ఏవెట్టి||
ఆమె: ||ఏవెట్టి||
అతడు: అవి పెదాలా రసగుల్లాలా.. అది నడుమా ఐసు క్రీమా
ఆమె: ఉడికిస్తుంద్రా నా బాడీ పార్ట్లు
అనిపిస్తుంద్రా ఒళ్లంతా స్వీట్లు