
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. తెలుగు సినిమా, ప్రేక్షకులు మూస పద్దతిలో సినిమా చేసుకొని, చూసుకుంటూ ఉండే వాళ్ళని అప్ డేట్ అవ్వరా అంటూ డిఫరెంట్ సబ్జెట్స్, టేకింగ్ తో పరిశ్రమ గతినే మార్చివేసాడు. ఇప్పుడేమో తనే అప్ డేట్ అవ్వకుండా మూస పద్దతిలో సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకు కారణాలు తెలియదు కానీ రీసెంట్ గా వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఎక్స్ వేదికగా 'విద్యార్థులు ఎదుర్కొంటున్న అసలు ముప్పు నీట్ పరీక్షల లీకేజీలు కాదు. మన కళ్లముందే వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీట్ లీకులు, పరీక్షల రద్దు వల్ల వ్యవస్థ గాయపడుతుందేమో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ప్రస్తుత విద్యా వ్యవస్థ పీకని కోసేస్తుంది. ప్రస్తుత విద్యావిధానాన్ని వెంటనే రద్దు చేసి, 'ఎడ్యుకేషన్ ని చంపేయాలి' (EDUCATION SHOULD BE KILLED).
ఇప్పటివరకు సమాజం అనుసరిస్తున్న బట్టీ చదువుల విధానం పూర్తిగా కాలం చెల్లిపోయిం ది. పుస్తకాలు చదవడం, బట్టీ పట్టడం, పరీక్షలు రాయడం, డిగ్రీలు పొందడం, ఉద్యోగాలు సాధించడం అనే పాతకాలపు ఫార్ములాని ఇకపై చింపి పారేయాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఒక వైద్య విద్యార్థి 5 సంవత్సరాలు ఎంబీబీఎస్, మరొక 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆపై 2 లేదా 3 సంవత్సరాలు స్పెషలైజేషన్ కోసం కేటాయిస్తూ, మొత్తంగా 10 సంవత్సరాల సుదీర్ఘకాలాన్ని కేవలం సమాచారాన్ని నేర్చుకోవడానికే వెచ్చిస్తున్నాడు. అయితే, ఒక విద్యార్థి తన 10 ఏళ్ల జీవితాన్ని ధారపోసి నేర్చుకునే సమాచారం మొత్తాన్ని, నేడు అతని జేబులో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్షణాల్లో అందిస్తోంది.
Also read: రామ్ చరణ్ క్షేమం కోసం ఉపాసన కీలక నిర్ణయం.. పిక్స్ వైరల్
ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు మూలకర్తగా భావించే ప్రసిద్ధ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ సయితం రాబోయే రోజుల్లో ఏఐ ప్రతి పనినీ మనుషుల కంటే అత్యంత మెరుగ్గా చేయగలదని గొంతు ఎత్తి హెచ్చరిస్తున్నారు. వైద్యులు ప్రస్తుతం చేసే రోగ నిర్ధారణ, డేటా విశ్లేషణ, చికిత్సా సూచనలు వంటి బాధ్యతలని కేవలం 1 నుండి 2 సంవత్సరాల వ్యవధిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోబోతోందని నిపుణులు ఏకోపPhysicianగా అంగీకరిస్తున్నారని వర్మ తెలిపారు.
Ram Gopal Varma, Neet





