Chikiri: చికిరి సాంగ్ పై రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు
on Nov 11, 2025

-రామ్ చరణ్ పై వర్మ వ్యాఖ్యలు
-ఎనర్జిటిక్ గా చేసాడు
-సోషల్ మీడియాలో రికార్డులు
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అప్ కమింగ్ మూవీ 'పెద్ది'(Peddi)కి సంబంధించిన 'చికిరి'(Chikiri)సాంగ్ తో హంగామా చేస్తున్నాడు. సదరు సాంగ్స్ కి సంబంధించిన లిరిక్స్ తో పాటు చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ కూడా వైరల్ గా మారాయి. ఫలితంగా సోషల్ మీడియాకి సంబంధించిన అన్ని విభాగాల్లోను పెద్ది ట్రెండ్ అయ్యి కూర్చుంది. దీన్ని బట్టి చికిరి సాంగ్ సృష్టిస్తున్న జోరుని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే 50 మిలియన్ల వ్యూస్ ని తన ఖాతాలో వేసుకుంది.
రీసెంట్ గా చికిరి సాంగ్ గురించి ప్రముఖ దర్శకుడు 'రామ్ గోపాల్ వర్మ'(Ram Gopal Varma)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు చాలా కాలం తర్వాత చికిరి సాంగ్ లో రామ్ చరణ్ రా లుక్ తో పాటు ఎనర్జిటిక్ లుక్ లో కనిపించి మెప్పించాడు. హీరోని ఎలివేట్ చెయ్యడమే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రఫీ విభాగాల ముఖ్య ఉద్దేశ్యం. చికిరి సాంగ్ కి వందలాది డాన్సర్లు, భారీ సెట్స్ లాంటి వాటిపై కాకుండా హీరోపైనే ప్రధాన దృష్టి ఉండేలా చేయడం దర్శకుడు బుచ్చిబాబు పని తీరుకి నిదర్శనం. ఒక స్టార్ తన చుట్టూ మెరుపులు ఉన్నప్పుడు కాకుండా సహజంగానే ఎక్కువగా ప్రకాశిస్తాడనే విషయాన్నీ కూడా మేకర్స్ అర్ధం చేసుకున్నారని ట్వీట్ చేసాడు. సదరు సాంగ్ కి సంబంధించిన లింక్ ని కూడా పోస్ట్ చెయ్యడం జరిగింది.
Also Read: అఖండ 2 ఆ థియేటర్ లో ఎన్నిరోజులు ఆడవచ్చు.. ఫ్యాన్స్ కోరిక తీరుతుందా!
వర్మ ప్రస్తుతం తన ఫస్ట్ మూవీ 'శివ' రీ రిలీజ్ సందర్భంగా వరుస ప్రమోషన్స్ ఇస్తు వస్తున్నాడు. 1989 నవంబర్ లో రిలీజైన శివ(Siva)నాగార్జున(Nagarjuna)రామ్ గోపాల్ వర్మ సినీ కెరీర్ ని ఒక మలుపు తిప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12 న థియేటర్స్ లో సందడి చేయడానికి మరోసారి రెడీ అవుతుండటంతో ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మేకర్స్ అయితే 'శివ'(Siva)ని అధునాతన సౌండ్ సిస్టమ్స్ తో అభిమానులు, ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



