
ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డిపై హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో భారీ చీటింగ్ కేసు నమోదైంది. చిత్ర పరిశ్రమకి చెందిన సహ నిర్మాత రజిత్ రావు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ విధంగా కేసు నమోదు చేయడంతో కోట్ల రూపాయల విలువైన భారీ ఆర్థిక లావాదేవీలు,మోసపూరితమైన వాగ్దానాల నేపథ్యం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రజిత్ రావు తన ఫిర్యాదులో 'వెంకట్ అనీష్ రెడ్డి తనకున్న భారీ రుణాలని క్లియర్ చేసుకోవడం కోసం అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బు కావాలని అడిగాడు. దీంతో నాకున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్, మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడి వద్ద నుండి అనీష్ రెడ్డి కోసం 40 లక్షలరూపాయలు ఇప్పించాను . తనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, లోన్స్ అన్నీ క్లియర్ అయిన వెంటనే, . 40 లక్షల మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తానని వెంకట్ అనీష్ రెడ్డి హామీ ఇచ్చాడు.
Also read: ఓటిటిలో రిలీజైన 48 గంటల్లోనే బ్యాన్ చేసి పడేసారు!
అయితే, ఇచ్చిన గడువు ముగిసి చాలా కాలం అవుతున్నప్పటికీ అనీష్ రెడ్డి ఆ డబ్బును తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. డబ్బు గురించి పదే పదే ఒత్తిడి చేయగా, అనీష్ రెడ్డి బాధ్యతారహితంగా ప్రవర్తించడమే కాకుండా తప్పించుకుంటూ తిరగడం ప్రారంభించాడు. పైగా నన్ను బెదిరించాడు. ఈ మోసంపై నాకు పూర్తి న్యాయం చేయాలి. నా డబ్బు నాకు ఇప్పించడమే కాకుండా ప్రాణ భయం కలిగించేలా బెదిరింపులకు పాల్పడుతున్న అనీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రజిత్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





