శ్రీరామావతారంలో ప్రభాస్ ఫస్ట్ లుక్.. ఎప్పుడంటే!
on Sep 19, 2021
పాన్ - ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమాల ఎంపిక మరింత వైవిధ్యంగా ఉంటోంది. ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రలు, కథాంశాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారాయన. ఇందులో భాగంగానే.. త్వరలో ప్రభాస్ ఓ మైథలాజికల్ మూవీతో పలకరించబోతున్నారు. ఆ చిత్రమే.. `ఆదిపురుష్`. ఇందులో శ్రీరాముడి వేషంలో దర్శనమివ్వనున్నారీ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో.
ఇదిలా ఉంటే.. కొన్ని నెలల క్రితం శ్రీరామనవమి సందర్భంగా `ఆదిపురుష్` నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల కాబోతోందంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. దీంతో.. ప్రభాస్ అభిమానులు నిరాశచెందారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న `ఆదిపురుష్` ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది. మరి.. శ్రీరామావతారంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.
కాగా, బాలీవుడ్ కెప్టెన్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న `ఆదిపురుష్`లో సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది.
Also Read