The Raja Saab: మారుతికి కొత్తరకం టార్చర్ చూపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్!
on Jan 24, 2026

ది రాజా సాబ్ ఎఫెక్ట్
మారుతికి చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
ట్రోల్స్, ఆర్డర్స్ తో మారుతి ఉక్కిరిబిక్కిరి
ప్రభాస్ రంగంలోకి దిగుతాడా?
అభిమానుల ప్రేమను, కోపాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే సినీ సెలబ్రిటీలు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. అలా ముందు వెనుక ఆలోచించకుండా పొరపాటున నోరు జారితే.. తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం దర్శకుడు మారుతి(Maruthi) పరిస్థితి అలాగే ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజా సాబ్'(The Raja Saab) మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశపరిచింది. జయాపజయాలు అనేవి సర్వ సాధారణం. అందరూ మంచి సినిమా చేస్తున్నామనే ఉద్దేశంతోనే ఉంటారు. కానీ, ఒక్కోసారి ఫలితాలు తారుమారవుతుంటాయి. 'రాజా సాబ్' కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈ రిజల్ట్ ని కేవలం మారుతికే ఆపాదించలేము. టీం అందరూ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ, ఫ్యాన్స్ ఎమోషన్స్ కి లాజిక్స్ తో పనిలేదు కదా. అందుకే దర్శకుడుని టార్గెట్ చేస్తుంటారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కొద్దిరోజులుగా మారుతికి చుక్కలు చూపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. చెప్పడానికి వీల్లేని మాటలతో విరుచుకుపడుతున్నారు. అయితే కొంతకాలం మారుతి సోషల్ మీడియాకు దూరంగా ఉంటే చాలు.. ఈ ట్రోల్స్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ, తప్పించుకోవడానికి వీల్లేని విధంగా మారుతికి కొత్త రకమైన టార్చర్ చూపిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
'ది రాజా సాబ్' సినిమాపై నమ్మకంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి తన ఇంటి అడ్రెస్ చెప్పిన విషయం తెలిసిందే. అదే మారుతి చేసిన తప్పయింది. సినిమా హిట్ అయ్యుంటే.. అభిమానులు మారుతికి గిఫ్ట్ లు కొని పంపించేవారేమో. కానీ, ఫ్లాప్ కావడంతో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ తో చుక్కలు చూపిస్తున్నారు. ఆన్ లైన్ లో ఫుడ్, గ్రాసరీ, క్లోత్స్ ఇలా ఒకటేమిటి.. ఏది పడితే మారుతి ఇంటి అడ్రెస్ కి ఆర్డర్ పెడుతున్నారట. వరుస ఆర్డర్స్ తో ఇరిటేట్ అయిపోయిన మారుతి.. తన పేరుతో ఏ ఆర్డర్ వచ్చినా వెనక్కి పంపించేయమని సెక్యూరిటీకి చెప్పాడట. దీంతో రెండు మూడు రోజులుగా వచ్చిన డెలివరీ బాయ్స్ కి నో చెప్పడమే సెక్యూరిటీ పని అయిపోయిందని అంటున్నారు.

Also Read: మార్చి 1.. ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్!
మా సినిమా ఫ్లాప్ అయితే.. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ విడుదలకు ముందు కొందరు దర్శకులు నోరు జారుతుంటారు. అలా మాట్లాడటం తప్పని.. ఒక సందర్భంలో మారుతి కూడా చెప్పాడు. అలాంటి మారుతీనే 'రాజా సాబ్' విషయంలో తన ఇంటి అడ్రెస్ చెప్పి చిక్కుల్లో పడ్డాడు. ఓ వైపు సోషల్ మీడియాలో ట్రోల్స్ తోనే ఇబ్బంది అంటే.. అది చాలదు అన్నట్టు వరుస ఆర్డర్స్ తో మరింత ఇబ్బంది పడుతున్నాడు.
ట్రోల్స్, ఆర్డర్స్ తో ఫ్యాన్స్ నుంచి మారుతికి ఈ టార్చర్ తప్పాలంటే.. ప్రభాస్ రంగంలోకి దిగాల్సిందే. మూవీ రిజల్ట్ అనేది అందరి బాధ్యత అని, అభిమానులు ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదని.. ప్రభాస్ టీం నుంచి ఒక ప్రకటన వస్తే బాగుంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



