రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
on Jan 23, 2026

వాయిదా పడిన పెద్ది మూవీ?
కొత్త రిలీజ్ డేట్ లాక్!
పెద్ది డేట్ కి ఉస్తాద్ భగత్ సింగ్!
ఈ ఏడాది మార్చి 27న విడుదల కావాల్సిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వాయిదా పడటమే కాదు, ఇప్పటికే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న మూవీ 'పెద్ది' (Peddi). ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను 2026, మార్చి 27న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే విడుదల తేదీకి ఇంకా రెండు నెలలే సమయముంది. షూటింగ్ ఇంతవరకు పూర్తి కాలేదు.
'పెద్ది' ఫస్ట్ హాఫ్ ఎడిట్ ఇప్పటికే లాక్ అయింది. ప్రస్తుతం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే పనిలో ఉన్నాడు. అయితే సెకండ్ హాఫ్ కి సంబంధించిన కొంత పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మరో 30 రోజులు దాకా షూటింగ్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అందుకే రిలీజ్ డేట్ ని వెనక్కి జరిపే ఆలోచనకు మేకర్స్ వచ్చారని వినికిడి. ప్రస్తుతం మే 1వ తేదీకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో నాగ చైతన్య మాస్ బొమ్మ!
ఇదిలా ఉంటే, నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'ది ప్యారడైజ్' (The Paradise) మూవీ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. మార్చి 26న విడుదల కావాల్సిన ఈ మూవీ.. షూటింగ్ పెండింగ్ ఉండటంతో పోస్ట్ పోన్ అయిందని టాక్.

మార్చి చివరిలో విడుదల కావాల్సిన 'ది ప్యారడైజ్', 'పెద్ది' సినిమాలు వాయిదా పడగా.. వాటి స్థానంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని మార్చి 26 లేదా 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



