Home

»

Latest News

వరుస ప్లాపుల తర్వాత నితిన్ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ కి ఇక నో రెస్ట్ 

Jul 15, 2026 11:52AM

 

నితిన్(nithiin).. తొలి చిత్రం జయంతోనే శతదినోత్సవంతో పాటు సిల్వర్ జూబ్లీ అందుకొని సంచలనం సృష్టించాడు. నెక్ట్ చిత్రం దిల్ కూడా అంతే. జయంకి తీసిపోని రీతిలో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'సంబరం' మూవీ దగ్గర నుంచి నితిన్ సినీ సంబరానికి బ్రేక్ పడింది.  

ఎన్నో ఆటు పోట్లు మధ్య వరుసగా 12 ప్లాపులు చూసినప్పటికీ 'ఇష్క్' , అ, ఆ' తో హిట్ ట్రాక్ లో వచ్చినట్టుగా అనిపించాడు. అయితే, ఇటీవలి కాలంలో ఎక్స్ట్రా ఆర్డినరీ       'రాబిన్‌హుడ్', 'తమ్ముడు' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. భారీ అంచనాలతో, భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మిగలడంతో నిర్మాతలకి  భారీ నష్టాలు వచ్చాయి. ఈ వరుస బాక్సాఫీస్ ఎదురుదెబ్బలతో నితిన్ కొంత కాలం ఆత్మపరిశీలనలో పడ్డారు. కథల ఎంపికలో రూటు మార్చాలని, బడ్జెట్‌లపై నియంత్రణ ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి తొందరపాటు లేకుండా పక్కా ప్లానింగ్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు నితిన్ ఇప్పుడు ఒకేసారి మూడు విభిన్నమైన మరియు క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా మరియు ఇటీవల జరిగిన చర్చల ద్వారా ఈ క్రేజీ అప్‌డేట్స్‌ను అభిమానుల ముందుకు తీసుకువచ్చారు. నితిన్ లైన్‌లో పెట్టిన ఈ మూడు ప్రాజెక్టులలో మొదటిది నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌లో రూపొందనుంది. గతంలో 'అ!', 'హిట్' సిరీస్ వంటి వైవిధ్యమైన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందించిన నాని బ్యానర్‌లో నితిన్ నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకు కొత్త దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించనుండగా, కన్నడ క్రష్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. నాని కంటెంట్ జడ్జిమెంట్, నితిన్ మాస్ అప్పీల్ కలిసి ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇక నితిన్ ఖాతాలో ఉన్న రెండో క్రేజీ ప్రాజెక్ట్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాతో నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి అనే ఇద్దరు ప్రతిభావంతులైన యువకులు దర్శకులుగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. వి.ఐ. ఆనంద్‌తో కలిసి నితిన్ ఒక విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్‌ను ఎంచుకున్నారు. గతంలో 'ఊరు పేరు భైరవకోన' వంటి వైవిధ్యమైన చిత్రాలు తీసిన వి.ఐ. ఆనంద్, నితిన్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. విజయ్ చిల్లా, చిట్టూరి శ్రీనివాసరావు నిర్మించే ఈ భారీ చిత్రం ఫ్యామిలీ మరియు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో సాగనుంది.


Also read: ఓజీ 2 లో ప్రకాష్ రాజ్ ఉంటాడా.. లేదంటే సత్య దాదాగా ఆ హీరో!

వీటన్నింటితో పాటు, గతేడాది 'ఆయ్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిలేరియస్ కామెడీ విజయాన్ని అందుకున్న యంగ్ డైరెక్టర్ అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో కూడా నితిన్ మరో క్రేజీ సినిమాకి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నికిత రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ కథ ఉండబోతోందని సమాచారం. ఇలా రొటీన్ మాస్ మసాలా ఫార్ములా పక్కన పెట్టి సైన్స్ ఫిక్షన్, కంటెంట్ ఓరియెంటెడ్ డ్రామా, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వైపు నితిన్ మొగ్గు చూపడం చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద తన పూర్వ వైభవాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

nithiin, nagavamsi, iv anand, anji k maniputhra

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com