Home

»

Latest News

డేటింగ్ చేయ‌కూడ‌ద‌నే రూల్‌తో సినిమాకి సంత‌కం చేసిన ఇస్మార్ట్ హీరోయిన్‌!

Jan 18, 2022

 

తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగుపెట్ట‌క ముందు బాలీవుడ్‌లో 'మున్నా మైఖేల్' మూవీతో హీరోయిన్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది నిధి అగ‌ర్వాల్‌. టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా న‌టించిన ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల‌యింది. ఆ త‌ర్వాత ద‌క్షిణాదికి త‌ర‌లి వ‌చ్చిన నిధి.. ఇటు తెలుగు, అటు త‌మిళ చిత్రాల‌తో బిజీ హీరోయిన్‌గా మారింది. పూరి జ‌గ‌న్నాథ్ సినిమా 'ఇస్మార్ట్ శంక‌ర్' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె లేటెస్ట్‌గా మ‌హేశ్‌బాబు మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా టైటిల్ రోల్‌తో ప‌రిచ‌య‌మైన 'హీరో' మూవీలో హీరోయిన్‌గా సూప‌ర్ గ్లామ‌ర‌స్‌గా క‌నిపించి ఆక‌ట్టుకుంది.

కాగా త‌న ఫ‌స్ట్ ఫిల్మ్ 'మున్నా మైఖేల్‌'లో న‌టించ‌డానికి నిధి నో డేటింగ్ నిబంధ‌న ఉన్న కాంట్రాక్ట్‌పై సంత‌కం చేసింద‌నే విష‌యం ఆ మూవీ రిలీజ్ టైమ్‌లో వెల్ల‌డైంది. అంటే ఆ సినిమాకి ప‌నిచేస్తున్న‌ప్పుడు హీరో టైగ‌ర్‌తో కానీ, ఇంకెవ‌రితో కానీ డేటింగ్ లాంటిదేమీ చేయ‌కూడ‌ద‌న్న మాట‌. ఇప్పుడు ఐదేళ్ల త‌ర్వాత‌, దానిపై నోరు విప్పింది నిధి. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో, నిజంగా ఆమె నో డేటింగ్ నిబంధ‌న ఉన్న కాంట్రాక్ట్‌పై సంత‌కం చేసిందా అనే ప్ర‌శ్న ఆమెకు ఎదురైంది. "నేను చేశాను. నిజం చెప్పాలంటే ఇంత‌కు ముందు మీకు చెప్పిన‌ట్లుగా కాంట్రాక్టుల‌ను బాగా చ‌దివి, ఆ త‌ర్వాత సంత‌కం చేయ‌డంలో నేనంత చురుకైన దాన్ని కాదు. కానీ నేనా కాంట్రాక్టుపై సంత‌కం చేశాను." అని ఆమె స‌మాధాన‌మిచ్చింది. 

Also read: విడాకులు సంగీత్ తో సెలెబ్రేట్ చేసుకోవాలి

ఆ నిబంధ‌న అన్యామైనంద‌ని అనిపించిందా అన‌డిగితే, "నేనూ దాన్ని ప‌ట్టించుకోలేదు. ఆ సినిమా వ‌చ్చినందుకే నేను చాలా హ్యాపీ ఫీల‌య్యాను. నా ప‌రిస్థితి ఎలా ఉందంటే, 'వావ్‌, నేను హీరోయిన్‌ను అయ్యాను' అనుకున్నాను. ఇంక దేన్నీ నేను ప‌ట్టించుకోలేదు. నాకు సంబంధించి, సినిమాని సంపాదించుకోవ‌డ‌మే గొప్ప‌నుకున్నాన‌నేది నిజం" అని చెప్పింది నిధి. ఇప్పుడామె త‌మిళ స్టార్ యాక్ట‌ర్ శింబుతో స‌హ‌జీవ‌నం చేస్తోంద‌ని విరివిగా ప్ర‌చారంలో ఉంది.

Also read: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య‌ ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో తెలుసా?

నిధి ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా చేస్తోంది. క్రిష్ జాగ‌ర్ల‌మూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ తార జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ కూడా న‌టిస్తోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com