Home

»

Latest News

ఇలియానా గుర్రాన్ని అదుపులోకి తెచ్చిన హీరో!

Jul 21, 2016

హీరోయిన్ ని పది మంది గూండాల నుంచి కాపాడేయడం, కుదిరితే ఓ వంద మందిని నరికేయడం వంటివి మన హీరోలు సినిమాల్లో అత్యంత సునాయాసంగా చేసేస్తుంటారు. అయితే నిజజీవితంలోనూ హీరోగా పేరు తెచ్చుకొనేవాళ్లూ చాలా తక్కువగా ఉంటారు. అలాంటి అరుదైన కథానాయకుల్లో ఒకడు అక్షయ్ కుమార్. అందుకే తన హీరోయిన్ కి ప్రమాదం జరగనుందని గ్రహించిన వెంటనే ఆలస్యం చేయకుండా స్పందించి ఆమెను ప్రమాదం నుంచి తప్పించాడు. 

విషయం ఏంటంటే.. అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం "రుస్తుం". ఈ సినిమాలో అక్షయ్ నేవీ ఆఫీసర్ గా నటిస్తుండగా, ఇలియానా అతడి భార్యగా కనిపించనుంది. సినిమాలోని ఒక సన్నివేశంలో ఇలియానా గుర్రంపై సవారీ చేసుకుంటూ వెళ్ళాలి, ఉన్నట్లుండి గుర్రం అదుపుతప్పి పరిగెట్టబోయింది, వెంటనే ఆ విషయాన్ని గమనించిన అక్షయ్ కుమార్ ఆ గుర్రాన్ని అదుపులోకి తీసుకువచ్చి ఇలియానాను కాపాడాడట. సీన్ బాగుండడంతో దర్శకుడు హ్యాపీగా షూట్ చేసేసి సినిమాలో వాడేశాడట. ఆగస్ట్ 12న విడుదలయ్యే సినిమాలో ఈ రియల్ సీన్ ను చూడవచ్చు!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com