అఖండ 2 ఎఫెక్ట్.. రిలీజ్ వాయిదా పడిన కొత్త చిత్రాలు
on Dec 10, 2025

-బాలయ్య సునామి స్టార్ట్
-పక్కకి తప్పుకున్న సినిమాలు
-నైట్ నుంచే జాతర స్టార్ట్
అన్ని అడ్డంకులు తొలగించుకొని గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష'(Balakrishna)అఖండ విజయనాదాన్నిచేసుకుంటు రేపు బెనిఫిట్ షోస్ తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో శివస్తుతుడుగా తాండవం చేయబోతున్నాడు. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో, సినీ సర్కిల్స్ లో ఇప్పటికే ప్యూర్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకోగా అఖండ 2(Akhanda 2)సాధించే సింహగర్జన ఏ రేంజ్ లో ఉంటుందనే లెక్కలు కూడా మొదలయ్యాయి. దీంతో బాలయ్య సునామి ఖాయమైన నేపథ్యంలో 12 న విడుదల కావాల్సిన చిత్రాలు తమ రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుంటున్నాయి.
అందులో భాగంగా సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటూ వస్తున్న నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్దార్ధ్'(psych siddhartha)ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు.సైక్ సిద్దార్ధ్ లో నందు హీరోగా చేస్తుండటంతో పాటు నిర్మాతగాను వ్యవహరించడం విశేషం. జనవరి 1 న వస్తున్నామని ప్రముఖ హీరో రానా(Rana)దగ్గుబాటితో ఒక ఫన్నీ వీడియో చెయ్యడం ద్వారా తెలియచేసాడు. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల నట వారసుడు రోషన్ కనకాల హీరోగా వస్తున్న మోగ్లీ కూడా ఈ నెల 12 న రావాల్సి ఉండగా 13 కి వాయిదా పడింది.
Also read: ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 ఈ రోజే.. అభిమానుల్లో జోష్
ఇక అఖండ 2 పన్నెండున రాదేమో అని మొత్తం ఎనిమిది చిత్రాలు సిల్వర్ స్క్రీన్ పై వస్తున్నట్టుగా ప్రకటించాయి. వాటిల్లో రెండు ఇప్పటికే బాలయ్య ని గౌరవిస్తూ పక్కకి తప్పుకున్నాయి. ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి మరిన్ని తప్పుకుంటాయేమో అనే వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. 'అన్నగారు వస్తారు' తో కార్తీ 12 నే బాక్స్ ఆఫీస్ వద్ద అడుగుపెట్టనున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



