`చెన్నకేశవరెడ్డి` తరహాలోనే..
on May 5, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణకి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రాల్లో `చెన్నకేశవరెడ్డి` (2002) ఒకటి. స్టార్ కెప్టెన్ వీవీ వినాయక్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా.. కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయకపోయినా.. సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ని మాత్రం మూటగట్టుకుంది. ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ చెన్నకేశవరెడ్డి, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ భరత్ గా తండ్రీకొడుకుల పాత్రల్లో అలరించారు బాలయ్య. కట్ చేస్తే.. దాదాపు 19 ఏళ్ళ తరువాత మరోసారి ఫ్యాక్షనిస్ట్, పోలీసాఫీసర్ గా ఒకే చిత్రంలో సందడి చేయనున్నారట నటసింహ.
ఆ వివరాల్లోకి వెళితే.. `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో బాలయ్య ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలోనే బాలకృష్ణ.. ఫ్యాక్షనిస్ట్, పోలీసాఫీసర్ గా ద్విపాత్రాభినయం చేయనున్నారట. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ఈ నెలలోనే బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. బాలకృష్ణ తాజా చిత్రం `అఖండ` చిత్రీకరణ తుదిదశలో ఉంది. మాస్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు.
Also Read