Home

»

Latest News

కళ్ళు తెరిపించిన బిజినెస్? నయనతార కీలక వ్యాఖ్యలు 

Aug 18, 2026 6:41PM

 

హీరోయిన్ అనే కట్ అవుట్ కి ఉన్న చరిష్మాని పాన్ ఇండియా రేంజ్ లో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న భామ నయనతార. అందుకే లేడీ సూపర్‌స్టార్‌ హోదాలో తన హవాని కొనసాగిస్తూ వస్తుంది. కానీ సినీ ప్రమోషన్ల విషయానికి వచ్చేసరికి నయనతార తీసుకునే నిర్ణయం ఎప్పుడూ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. దశాబ్ద కాలానికి పైగా ఏ సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్‌కూ రాకపోవడం, ప్రెస్ మీట్‌లలో పాల్గొనకపోవడం వెనుక రకరకాల వార్తలు ప్రచారంలో ఉండేవి. నయనతారకు అహంకారమని, అందుకే ఇంటర్వ్యూలకి , మీడియా ముందుకు రాదని కొంతమంది బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

 కానీ, ఈ సుదీర్ఘ మౌనం వెనుక ఉన్న అసలు చేదు నిజాలు మరియు మానసికమైన అసౌకర్యం ఏమిటనేది బెంగళూరులో జరిగిన రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' ప్రాజెక్ట్ వేదికపై స్వయంగా ఆమె బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.  తన కెరీర్ ప్రారంభ రోజుల్లో పబ్లిక్ ఈవెంట్లలో ఎదురైన కొన్ని దారుణమైన అనుభవాలు తనను తీవ్రంగా కలచివేశాయని నయన్ వెల్లడించింది. గతంలో పెద్ద ఆడియో వేడుకల్లో హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత లభించకపోవడం, కేవలం వేదికలపై గ్లామర్ బొమ్మలుగా నిలబెట్టి అవమానించడం మనసుని  బాగా గాయపరిచింది. అంతేకాకుండా, సినిమాలో తమ 100% శ్రమ, పాత్రల తీవ్రత గురించి మాట్లాడకుండా... కేవలం వ్యక్తిగత జీవితంపైనే మీడియా 90% ఆసక్తి చూపడం, అసౌకర్యంగా ఫీలయ్యే ప్రశ్నలు అడగడంతో ప్రమోషన్లకు దూరంగా ఉండాలని  నిర్ణయించుకున్నానాని చెప్పుకొచ్చింది . 


సాధారణంగా నటీనటులు ఇతరుల సినిమాలకు రాకపోయినా, తమ సొంత బ్యానర్ సినిమాలకు లేదా లీడ్ రోల్ చేసిన సినిమాలకు ప్రమోషన్లు చేస్తుంటారు. కానీ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి 'రౌడీ పిక్చర్స్' బ్యానర్‌పై ఎన్ని సినిమాలు నిర్మించినా, తన విధానంలో మార్పు రాలేదు. 'మాయ', 'కనెక్ట్' లాంటి చిత్రాల సమయంలో కూడా కేవలం 1 లేదా 2 ఎంపిక చేసిన మీడియా సంస్థలకు రికార్డెడ్ బైట్స్ మాత్రమే ఇచ్చి సరిపెట్టింది.  అయితే, ఇటీవల నయనతార తన 'నో-ప్రమోషన్' రూల్‌ను పక్కన పెట్టి కొన్ని ప్రత్యేకమైన వేదికలపై ప్రత్యక్షమవ్వడం పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న 'టాక్సిక్' చిత్రం కోసం కన్నడ స్టార్ యశ్ స్వయంగా ఒక్క ఫోన్ కాల్ చేయగానే, ఆయనపై ఉన్న గౌరవంతో బెంగళూరు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

Also read: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా!

యశ్ ఒరిజినాలిటీ, ఆయన అడిగిన తీరు తనను ఎంతో కన్విన్స్ చేశాయని నయన్ చెప్పింది. 'టాక్సిక్' మాత్రమే కాదు...  మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్‌ గారు' చిత్రం కోసం కూడా నయనతార తన కఠినమైన రూల్‌ని సడలించింది. బిజినెస్ లోకి అడుగుపెట్టిన నయనతార తన స్కిన్ కేర్ ఉత్పత్తులుని కూడా ప్రచారం చేస్తూ బిజినెస్ లోకి అడుగుపెట్టి వరుస ప్రమోషన్స్ చేసింది. అలాగే తను నిర్మాతగా వ్యవహరించిన  సినిమాలకి కూడా ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. 

NayanThara, Chiranjeevi, Toxic, Manashankara varaprasad

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com