
దర్శకురాలు నందిని రెడ్డి 'మా ఇంటి బంగారం'తో లైమ్ లైట్ లోకి వచ్చింది. లైమ్ లైట్ లోకి రావడమే కాదు రేపో మాపో వంద కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధంగా ఉంది. దీంతో అభిమానులు సమంత తో హ్యాట్రిక్ మూవీ ఎప్పడు ఉంటుందనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు.
తాజాగా నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 40 ఏళ్లు దాటినా, ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో పెళ్లి అనేది ఒక 'డూ ఆర్ డై' నిబంధన లేదా కచ్చితంగా పాటించాల్సిన రూల్ ఏమీ కాదు. నా మనస్తత్వానికి సరిపోయే, మెంటాలిటీకి సింక్ అయ్యే సరైన వ్యక్తి దొరకలేదు. నచ్చిన వాళ్లతో కూడా భావాలు కుదరకపోవడం వల్లే వివాహ బంధానికి దూరంగా ఉన్నాను. ముఖ్యంగా ఈ విషయంలో నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. జీవితం సంతోషంగా సాగాలి అంటే కేవలం మొగుడు, పెళ్లాం అనే ఒకే ఒక్క బంధం మాత్రమే ఉంటే సరిపోదు. మనిషి జీవితంలో ఎన్నో రకాల అనుబంధాలు ఉండాలి. మన కష్టసుఖాలని పంచుకోవడానికి, మన బాధ్యతలను మోయడానికి, అండగా నిలవడానికి కేవలం భర్త మాత్రమే అవసరం లేదు; ఆ స్థానంలో మంచి స్నేహితులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు వంటి వారు ఎందరో ఉంటారు. నా చుట్టూ నేను ఒక అద్భుతమైన, నమ్మకమైన రిలేషన్స్ ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. నా పక్కన లేనిది కేవలం ఒక మొగుడు మాత్రమే. మిగతా అన్ని రకాల బంధాలు, ఆనందాలు నా జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నానని బాధపడలేదు, లోన్లీగా ఫీల్ అవ్వలేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి.
Also read: Rao Bahadur: రావు బహదూర్ ట్విట్టర్ రివ్యూ ఇదే!
2011లో నాని, నిత్యామీనన్ జంటగా వచ్చిన 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకురాలిగా ప్రస్థానం ప్రారంభించిన నందినిరెడ్డి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుని సొంతం చేసుకున్న నందిని రెడ్డి ఖాతాలో 'కళ్యాణ వైభోగమే', 'ఓ బేబీ' వంటి చిత్రాలు ఉన్నాయి.
Nandini reddy about her marriage, nandini reddy opens about her marriage and single life, Director Nandini Reddy Marriage





