'లవ్ స్టోరి'తో నెక్ట్ లెవెల్ హ్యాపీనెస్ పొందాను: నాగ చైతన్య
on Sep 23, 2021
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా 'లవ్ స్టోరి'. ఈ సినిమా రేపు(సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగ చైతన్య సినిమాలో నటించిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు.
శేఖర్ కమ్ముల గారి సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని చైతన్య తెలిపారు. శేఖర్ గారి చిత్రాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుందని అన్నారు. రియలిస్టిక్ చిత్రాలంటే తనకి ఆసక్తి అని చెప్పిన చైతన్య.. మజిలీ సినిమాలో ఈ సంతృప్తి కొంత దొరికిందని, లవ్ స్టోరితో నెక్ట్ లెవెల్ హ్యాపీనెస్ పొందానని చెప్పారు.
శేఖర్ గారు చాలా కంఫర్ట్ ఇచ్చి సినిమా చేయించారు. ఆయనతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, పర్సన్ గా ఎదిగాను. చాలా విషయాలు నేర్చుకున్నాను అని చైతన్య తెలిపారు. శేఖర్ గారి గత చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఎక్కువ పేరొస్తుంది. కానీ లవ్ స్టోరిలో సాయి పల్లవితో పాటు నా క్యారెక్టర్ కు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందని, ఇద్దరికీ మంచి పేరొస్తుంది చెప్పారు. సాయి పల్లవితో నటించడం ఎంజాయ్ చేశాను. తను గుడ్ ఆర్టిస్ట్, డాన్సర్ అన్నారు.
"ఇటీవల సుకుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం. సుకుమార్ గారు కూడా నాకు అదే సజెషన్ ఇచ్చారు. తను కూడా రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు." అన్నారు.
మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తానని చెప్పిన చైతన్య.. అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు. ఆయన అపాయింట్ మెంట్ దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తామని చైతన్య అన్నారు.
చైతన్య మాటలను బట్టి చూస్తుంటే ఆయన లవ్ స్టొరీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.