ఆమ్ఆద్మీ పార్టీ నేత ఎమ్మెస్
on Mar 18, 2014
ఆమ్ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ నేపధ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ కేజ్రివాల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "క్రేజివాలా" అనే టైటిల్ పెట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది. మోహన ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సౌండ్ ఎన్ క్లాప్స్ బ్యానర్లో జి.హ్రిషికేష్ గౌడ్ నిర్మిస్తున్నారు. "ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే.. ప్రయత్నం విరమిస్తే మరణించినట్టే" అనే నినాదం ఈ చిత్ర పోస్టర్ పై కనిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.