నలుపే అందం అంటున్న మీరా జాస్మిన్
on Jun 27, 2022
మీరా జాస్మిన్ ఎప్పుడో, ఎక్కడో విన్న పేరులా అనిపిస్తోంది కదా. అవును, ఒకప్పుడు ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ చేసి ఇప్పుడు కనిపించకుండా దుబాయ్ వెళ్లి సెటిల్ ఐపోయిన పందెం కోడి అన్నమాట. ఐతే మీరా జాస్మిన్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే మూవీ రవితేజ నటించిన 'భద్ర'. అందులో ఎంతో క్యూట్ గా, స్మార్ట్ గా కనిపిస్తుంది. ఐతే ఇటీవల మీరా మూవీస్ చేయడం చాలా తగ్గించేసింది. కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అలా మెరుస్తూ ఇలా మాయమౌతోంది. ఒకప్పుడు చాలా హోమ్లీ లుక్ తో అద్భుతః అనిపించే అందంతో అచ్చమైన తెలుగమ్మాయిలా ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం రూటు మార్చి స్పెషల్ డ్రస్సెస్ లో ట్రెండీగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటూ మళ్ళీ మూవీస్ లో రీఎంట్రీ కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాని కోసం కొంచెం అందాల డోస్ ని కూడా పెంచినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ బ్లాక్ డ్రస్సుల్లో తమ అందాల్ని సోషల్ మీడియా ఆరబోయడం చూస్తూనే ఉన్నాం. అదే దారిలో మీరా కూడా వెళ్తోంది. "నలుపు అందమైంది, రహస్యమైంది" అనే కాప్షన్ పెట్టి బ్లాక్ డ్రెస్ ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈమె పిక్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే తన స్కూల్ ఫోటో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి జస్సూ ఎక్కడుందో గుర్తుపట్టండి అంటూ అడిగింది. ఈ భామ తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, మహారథి, రారాజు, యమగోల మళ్ళీ మొదలయ్యింది, గోరింటాకు, బంగారు బాబు, మా ఆయన చంటి పిల్లాడు, ఆకాశ రామన్న వంటి మూవీస్ లో యాక్ట్ చేసింది. చివరిగా 'మోక్ష' అనే మూవీలో కనిపించి మాయమైపోయింది.
తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం మూవీస్ లో నటించింది మీరా. దుబాయ్ లో ఇంజినీర్‌గా పనిచేసే అనిల్ జాన్ టైటస్ అనే అతన్ని 2014 లో వివాహం చేసుకుని అక్కడే సెటిల్ ఐపోయింది. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీకి పునాదులు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బొద్దుగుమ్మ ఇప్పుడు బక్కచిక్కిన మీరాగా అవతారమెత్తింది. మరి మీరాకి అదృష్టవం ఎలా ఉందో, మూవీస్ లో ఆఫర్స్ వస్తాయో, రావో వేచి చూడాలి.