Home

»

Latest News

సితార‌తో జ్ఞాప‌కాల‌ను నిర్మిస్తోన్న మ‌హేశ్‌!

May 14, 2020 9:29PM

 

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కూతురు సితార‌తో క‌లిసి దిగిన స‌ర‌దా ఫొటోల‌ను షేర్ చేశాడు.  "Building memories one step at a time."  అంటూ ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ పెట్టాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో కుటుంబంతో క‌లిసి హాయిగా కాలం గ‌డిపేస్తున్నాడు, ఈ ఏడాది ఆరంభంలో 'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన మ‌హేశ్‌. ఈ టైమ్‌లో త‌ర‌చూ కొడుకు గౌత‌మ్‌, కూతురు సితారతో తాను క‌లిసి గ‌డుపుతున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందం క‌లిగిస్తున్నాడు.

'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీ త‌ర్వాత గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో న‌టించేందుకు అత‌ను సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఈలోగా దాదాపు ప్ర‌తి రోజూ త‌న కుటుంబంతో గ‌డుపుతున్న సంద‌ర్భంలోని అంద‌మైన క్ష‌ణాల‌ను కెమెరా క‌న్నుతో బంధించి వాటిని షేర్ చేస్తూ వ‌స్తున్నాడు. సోషల్ మీడియా అకౌంట్ల‌లో మిలియ‌న్ల సంఖ్య‌లో ఫాలోయ‌ర్స్ ఉండ‌టంతో అత‌డు పంచుకుంటున్న ఫొటోల‌ను వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. మ‌హేశ్ షేర్ చేస్తున్న ఫొటోల‌ను చూస్తుంటే, అత‌ను ఈ లాక్‌డౌన్ పీరియ‌డ్‌ను కుటుంబంతో క‌లిసి ఎంత‌గా ఆస్వాదిస్తున్నాడో అర్థ‌మ‌వుతోంది. తాజా ఫొటోల్లో మెట్ల మీద సితార‌ను అల్ల‌రి ప‌ట్టిస్తున్న మ‌హేశ్‌ను మ‌నం చూడొచ్చు.

ప‌ర‌శురామ్‌తో సినిమా త‌ర్వాత టాప్ డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో మ‌హేశ్ న‌టించ‌నున్నాడు. ఈ కాంబినేష‌న్ కోసం ఫ్యాన్స్ మాత్ర‌మే కాకుండా సినీ ప్రియులంతా అమితాస‌క్తితో వెయిట్ చేస్తున్నార‌నేది నిజం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com