Home

»

Latest News

Maa inti bangaram: మా ఇంటి బంగారం ఖాతాలో మరో ఘనత.. జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట

Jun 30, 2026 12:03PM

 

 

సమంత , నందిని రెడ్డి, రాజ్ నిడిమోరు ఏ ముహూర్తాన 'మా ఇంటి బంగారం' గురించి డిస్కర్స్ చేసుకున్నారో గాని వరల్డ్ వైడ్ గా 'మా ఇంటి బంగారం' రికార్డుల సునామీని సృష్టిస్తుంది. ఇటీవల కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయనే చర్చ జరుగుతున్న సమయంలో, ఈ సినిమా సాధిస్తోన్న కలెక్షన్ల స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతను విశేషంగా ఆకట్టుకుంటూ అన్ స్టాపబుల్ రేంజ్‌లో దూసుకుపోతోంది.

 కలెక్షన్ల వివరాల్లోకి వెళితే, మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పట్టు సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం తొలి రోజే దేశవ్యాప్తంగా రూ. 5.35 కోట్ల నెట్ కలెక్షన్లు, రూ. 6.20 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా 2,658 షోలతో ఈ చిత్రం సగటున 36 శాతం ఆక్యుపెన్సీ సాధించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీ ఆరంభాన్ని అందుకుంది. తొలి రోజే విదేశీ మార్కెట్లలో లభించిన రూ. 4.50 కోట్ల గ్రాస్‌తో కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ. 10.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ వసూళ్లతో సమంత తన కెరీర్‌లోనే సోలో హీరోయిన్‌గా అత్యధిక తొలి రోజు కలెక్షన్లు సాధించిన ఘనతను అందుకుని, తన పాత రికార్డు 'యశోద' (మొదటి రోజు రూ. 3.06 కోట్ల నెట్) రికార్డుని  తిరగరాసింది.

కేవలం తొలి రోజే కాకుండా, లాంగ్ రన్‌లోనూ ఈ సినిమా రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా ఓవర్సీస్, కోలీవుడ్ మార్కెట్లలోనూ ఈ చిత్రం అద్భుతమైన హోల్డ్‌ను ప్రదర్శిస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అయిన బుక్‌మైషో (BookMyShow) మరియు డిస్ట్రిక్ట్ (District) యాప్స్‌లలో కలిపి ఇప్పటివరకు ఏకంగా 17 లక్షలకు పైగా (1.7 MILLION+) టికెట్లు అమ్ముడయ్యాయి. తొమ్మిదో రోజు నాటికి ఈ సినిమా దేశీయంగా రూ. 42.95 కోట్ల నెట్, విదేశాల్లో  21.85 కోట్ల గ్రాస్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా  71.57 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

Also read: Honey Rose: హనీ రోజ్ కి షాక్ ఇచ్చిన ప్రముఖ బిజినెస్ మెన్ 


తాజా సమాచారం ప్రకారం  బాక్సాఫీస్ వద్ద ఏకంగా 80 కోట్ల మార్కు  దాటేసి, ప్రస్తుతం 100 కోట్ల క్లబ్‌పై కన్నేసింది.  లాస్ట్ 24 అవర్స్ లో బుక్ మై షో వేదికగా సుమారు 25 వేళ టికెట్స్ బుక్ అవ్వడమే అందుకు ఉదాహరణ.   గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి సైతం చిత్ర బృందాన్ని తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com