ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబట్టిన 'లవ్ స్టోరి'!
on Sep 25, 2021
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరి'. శుక్రవారం(సెప్టెంబర్ 24న) విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు మంచి వసూళ్లను రాబట్టింది.
'లవ్ స్టోరి' మూవీపై ముందు నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచాయి. దీంతో ప్రేక్షకులు ఈ మూవీని చూడటానికి ఆసక్తి కనబరిచారు. దీంతో టికెట్స్ ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే టికెట్లు అమ్ముడయ్యాయి. సెకండ్ వేవ్ తరువాత థియేటర్ల దగ్గర ఏ సినిమాకి కనిపించనంత సందడి లవ్ స్టోరికి కనిపించింది. దీంతో సినిమా తొలిరోజున 8.5 కోట్ల షేర్ ను రాబట్టింది.
లవ్ స్టోరి మూవీ మొదటి షోకే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని చోట్లా మంచి కలెక్షన్లు రాబట్టింది. శుక్రవారం ఒక్క నైజాంలోనే ఈ మూడున్నర కోట్ల రూపాయలను వసూలు చేసింది. యూఎస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 8.5 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి లవ్ స్టోరి ముందు ముందు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read