Home

»

Latest News

lokesh kanagaraj: ఇంకెప్పుడు  లోకేష్.. వైరల్ గా మారిన లైనప్ 

Jun 1, 2026 4:56PM

 

లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj)ప్రీవియస్ మూవీ  'కూలీ'తో యావరేజ్ హిట్ ని అందుకున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్  ఖాన్ తో   ప్లాన్ చేస్తన్న విషయం తెలిసిందే. ముందుగా  అల్లు అర్జున్ మూవీ స్టార్ట్ కానుంది. అదే టైంలో  జయం రవి, రాఘవ లారెన్స్ హీరోలుగా తెరకెక్కుతున్న 'బెంజ్ ' కి కథని అందిస్తున్నాడు.


ఇవన్నీ బాగానే ఉన్నా  ఖైదీ సీక్వెల్ ఉంటుందని ఎప్పట్నుంచో ఊరిస్తున్నాడు. కానీ దాని ఊసే లేదు.  విక్రమ్ 2 కూడా తెరకెక్కించాల్సి ఉన్నా అదే పరిస్థితి. ఎక్కడ విక్రమ్ 2 గురించి మాట్లాడటం లేదు.  లియో 2 ఉంటుందని చెప్పినా విజయ్ సినిమాలకి స్వస్తి చెప్పడంతో లియో 2 ఉండదు. విక్రమ్ లో సూర్య చేసిన రోలెక్స్ క్యారక్టర్ తో సినిమా ఉంటుందని చెప్పాడు. ఆ చిత్రం ఊసు కూడా లేదు. వీటిన్నిటిని పక్కన పెట్టి అల్లు అర్జున్ సినిమా,అమీర్ ఖాన్ మూవీ అనౌన్స్ చేసాడు కదా మరి అవి ఉండవా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.

also read: CM కి తమ పవర్ ఏంటో చూపించిన SPG కమాండోస్


సంక్రాంతి కానుకగా మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన 'AA 23' ప్రాజెక్ట్ సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 'పుష్ప 2: ది రూల్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా  1871 కోట్ల భారీ వసూళ్లు సాధించిన అల్లు అర్జున్  ఈ సారి లోకేష్ కి జత కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు  లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com