Home

»

Latest News

kushboo: ఖుష్బూ కూతురి పెళ్లి.. మోదీ ఆశీస్సులు  

May 30, 2026 5:57PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో కొన్ని దశాబ్దాల పాటు ఒక  వెలుగువెలిగిన సీనియర్ నటి, భారతీయ జనతా పార్టీ కీలక నేత ఖుష్బూ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె పెద్ద కుమార్తె అవంతిక సుందర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడితో అవంతిక వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో ఖుష్బూ సుందర్ కుటుంబంలో పెళ్లి సందడి అప్పుడే మొదలైంది. కుటుంబంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ వివాహ వేడుకకి దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే పనిలో పడ్డారు ఖుష్బూ దంపతులు. ఇందులో భాగంగానే వారు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అద్భుతమైన, మరపురాని క్షణాన్ని సొంతం చేసుకున్నారు.

ఖుష్బూ ,ఆమె భర్త, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుందర్ లు కుమార్తె అవంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్‌లతో కలిసి ఢిల్లీలో భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఖుష్బూ దంపతులు తమ కుమార్తె వివాహ ప్రథమ ఆహ్వాన పత్రికని  మోదీకి స్వయంగా అందజేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, దేశ ప్రధాని తమ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించడం పట్ల ఖుష్బూ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. వివాహ పత్రికని  స్వీకరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే నూతన వధూవరులైన అవంతిక, శ్రవణ్‌లను సాదరంగా ఆహ్వానించి, వారిని ఆశీర్వదించారు.

ప్రధాని మోదీని కలిసిన ఈ అపురూప క్షణాలకు సంబంధించిన ఫోటోలను ఖుష్బూ సుందర్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ 'ఎక్స్' వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఖుష్బూ సాంప్రదాయబద్ధమైన పింక్ కలర్ సిల్క్ శారీలో ఎంతో హుందాగా కనిపించగా, అవంతిక, శ్రవణ్ జంట ఎంతో క్యూట్‌గా మెరిసిపోయారు. ప్రధాని మోదీని కలవడం తమకు దక్కిన గొప్ప గౌరవంగా ఖుష్బూ అభివర్ణించారు. దేశాన్ని నడిపించే అత్యంత బిజీ నాయకుడు తమ ఆహ్వానాన్ని మన్నించి, కాబోయే దంపతులను మనస్ఫూర్తిగా దీవించడం తమకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఖుష్బూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ ఒక ప్రత్యేక నోట్ రాసుకొచ్చారు. "ఈరోజు ఢిల్లీలో భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుసుకునే అదృష్టం, గౌరవం మాకు లభించాయి. నా భర్త సుందర్, నేను కలిసి మా కుమార్తె రాబోయే వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికని అందించాం. ప్రధాని గారు ఎంతో ఆప్యాయంగా కాబోయే కొత్త జంటని ఆశీర్వదించారు. నిరంతరం దేశ సేవలో ఎంతో బిజీగా ఉండే షెడ్యూల్‌లోనూ మా కోసం విలువైన సమయాన్ని కేటాయించినందుకు మేము నిజంగా కృతజ్ఞులమై ఉంటాము. మేము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. వినమ్రతతో తలవంచుతున్నాము. థ్యాంక్యూ ప్రధానమంత్రి జీ" అంటూ రాసుకొచ్చారు.


also read: The sheep detectives: 854 కోట్లు వసూలు చేసిన గొర్రెల మంద డిటెక్టివ్ కామెడీ.. అసలు మిస్ అవ్వకండి

ఖుష్బూ, సుందర్ దంపతులకి ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమార్తె ఆనందిత ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, చిన్న కుమార్తె అవంతిక త్వరలోనే హీరోయిన్‌గా మలయాళ చిత్ర పరిశ్రమలో 'ఆరంభం' అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేయబోతుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com