చేయీ చేయీ కలిపి.. కిమ్, లియాండర్.. సహజీవనమేనా?!
on Aug 2, 2021
ఇటీవల గోవా వెకేషన్లో ఒక రెస్టారెంట్లో సన్నిహితంగా కనిపించి డేటింగ్ రూమర్స్‌కు ఆస్కారమిచ్చిన 'ఖడ్గం' హీరోయిన్ కిమ్ శర్మ, లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ తాజాగా ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని, చేయి చేయి కలిపి వాకింగ్ చేస్తూ కెమెరా కళ్లకు చిక్కారు. వారిద్దరి వ్యవహారం చూస్తుంటే, ఆ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే, సహజీవనం చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది.
లియాండర్ వైట్ టి-షర్ట్స్, షార్ట్స్‌లో క్యాజువల్ లుక్‌లో కనిపించగా, వైట్ అండ్ పింక్ మాక్సీ డ్రస్‌లో కనిపించింది కిమ్. తమతో పాటు పెట్ డాగ్‌ను కూడా వారు వెంట తీసుకుని వెళ్లారు. ఔటింగ్ ముగించుకొని గేట్లోంచి ఇంటికి వెళ్తున్న దృశ్యం కూడా కెమెరాకు దొరికింది.
కిమ్, లియాండర్ కలిసి సరదాగా వాకింగ్‌కు వెళ్లడం సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతోంది. గమనించదగ్గ విషయమేమంటే.. ఇద్దరిలో ఎవరూ ముఖానికి మాస్క్ ధరించలేదు. కొవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్న సందర్భంలో వారు ఇలా మాస్కులు లేకుండా బయట తిరగడాన్ని పలువురు వేలెత్తి చూపుతున్నారు.
గత నెల, కిమ్, లియాండర్ కలిసి డిన్నర్ చేస్తున్న దృశ్యాల్ని గోవాలోని ఓ రెస్టారెంట్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయడంతో ఆ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే ప్రచారం గుప్పుమంది. గతంలో తెలుగు యాక్టర్ హర్షవర్ధన్ రాణేతో కిమ్ డేటింగ్ చేసింది. 2019లో వారు విడిపోయారు.
Also Read