
కోలీవుడ్ లో ఒక క్రేజీ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ అయింది. హీరో కార్తీ, డైరెక్టర్ మోహన్ రాజా ఒక సినిమా కోసం చేతులు కలిపారు.
విభిన్న సినిమాలతో తమిళ్ తో పాటు, తెలుగులోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. త్వరలో ఆయన 'సర్దార్ 2'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 10న విడుదల కానుంది. అయితే ఇదే బ్యానర్ లో కార్తీ మరో సినిమా అనౌన్స్ చేయడం విశేషం. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు.
కోలీవుడ్ లో 'రీమేక్ కింగ్'గా మోహన్ రాజాకు పేరుంది. రీమేక్స్ తో పాటు, 'తని ఒరువన్' (తెలుగులో 'ధృవ') లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన క్రెడిట్ కూడా మోహన్ రాజా సొంతం. తెలుగులో 'హనుమాన్ జంక్షన్' లాంటి ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ ను అందించిన ఆయన, మెగాస్టార్ చిరంజీవితో 'గాడ్ ఫాదర్' కూడా చేశారు.
2017లో వచ్చిన 'వేలైక్కారన్' తర్వాత ఏకంగా తొమ్మిదేళ్లకు మోహన్ రాజా తమిళ్ లో సినిమా చేస్తున్నారు. అంతకంటే స్పెషల్ ఈ ఏడాదితో ఆయన దర్శకుడిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ 25వ సంవత్సరంలో తన 11వ సినిమా కోసం కార్తీతో చేతులు కలపడం సంతోషంగా ఉందని మోహన్ రాజా అన్నారు. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోబోతోందని సమాచారం.
Karthi, Mohan Raja, Prince Pictures






