Home

»

Latest News

kangana ranaut: భారత్ భాగ్య విధాత మూవీకి మన ముఖ్యమంత్రి బంపర్ ఆఫర్

Jun 10, 2026 1:07PM

 


స్టార్ హీరోయిన్  కంగనా రనౌత్ ఈ నెల 12 న 'భారత్ భాగ్య విధాత' అనే చిత్రంతో థియేటర్స్ లో టేక్ ఆఫ్ అవుతున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే దేశ రాజధానిలో ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. నిన్న మంగళవారం సాయంత్రం ఢిల్లీలో  ప్రత్యేక షో  ప్రదర్శించారు. ఈ షోకి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మూవీ వీక్షించారు.

అనంతరం ఆమె మాట్లాడుతు దేశ ప్రజలందరిలో దాగి ఉన్న సేవాతత్పరత, దేశభక్తిని ఈ చిత్రం తట్టిలేపుతుంది. ఢిల్లీలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాని  చూడాలనే ఉద్దేశంతో  పన్ను మినహాయింపు ఇస్తున్నాను. పార్లమెంట్‌లోను, వెండితెరపై సమాజ హితం కోసం గొంతుకని  వినిపించే కంగనా రనౌత్ ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. భారతదేశ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుగా నిలిచిపోయిన 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో 'భారత్ భాగ్య విధాత' తెరకెక్కింది. అయితే, సాధారణంగా ఇలాంటి కథల్లో కనిపించే సైనికులు, పోలీసుల కోణంలో కాకుండా, ఆ భయానక రాత్రి కామా హాస్పిటల్‌లో ప్రాణాలకి  తెగించి పోరాడిన నర్సులు, వార్డ్ బాయ్స్ వంటి సామాన్య హెల్త్‌కేర్ సిబ్బంది త్యాగాలని చూపించారు. యూనిఫామ్ వేసుకున్న వారే కాదు, సమాజం కోసం నిలబడే ప్రతి సామాన్యుడు దేశ రక్షకుడే అని ఈ సినిమా నిరూపించిందని సీఎం రేఖా గుప్తా కొనియాడారు. 


Also read: Ashu reddy: అషురెడ్డి ఈజ్ బ్యాక్... బోల్డ్ ఫోటోలతో ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తున్న బ్యూటీ


ఈ అపూర్వ గౌరవంపై కంగనా రనౌత్ స్పందిస్తూ 'ఢిల్లీ ముఖ్యమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.  ఫోన్ చేసి ఆహ్వానించగానే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ రేఖా గుప్తా మేడమ్  మా మూవీ చూడటం, టాక్స్ ఫ్రీ ఇవ్వడం మా  బృందానికి దక్కిన అతిపెద్ద గౌరవమని తెలిపింది. కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని మాండ్య పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపి గా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com