ఇంటిపై ప్రముఖ నటుడి కాల్పులు.. లోపల ఎవరున్నారో తెలుసా!
on Jan 24, 2026

-కాల్పుల కలకలం
-ఆ నటుడు ఎందుకు చేసాడు
-అసలు కాల్పులకి గల కారణం ఏంటి!
కమాల్ రషీద్ ఖాన్(kamaal Rashid Khan).. సుదీర్ఘ కాలం నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రచయితగా, నటుడిగా నిర్మాతగా రాణిస్తూ తన కంటు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సినీ క్రిటిక్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఉంది. అటువంటి కమాల్ ని నిన్న రాత్రి ముంబై లో పోలీసులు అరెస్ట్ చేసారు. మరి అరెస్ట్ కి దారి తీసిన కారణమేంటో చూద్దాం.
కొన్ని రోజుల క్రితం ముంబై(Mumabai)అంధేరి ఏరియాలో ఉన్న నలంద సొసైటీ లోని ఒక నివాస భవనంపై గుర్తి తెలియని ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. రెండు రౌండ్లు పాటు జరిపిన కాల్పుల్లో ఎవరికి ప్రాణ నష్టం జరగకపోయినా అక్కడ ఉన్న వారంతా భయబ్రాంతులకి గురయ్యారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాఫు చేపట్టగా కమాల్ నే తన లైసెన్సు రివాల్వర్ తో కాల్పులు జరిపినట్టుగా గుర్తించి అరెస్ట్ చేసారు. దీంతో ఆ బిల్డింగ్ లోపల ఎవరున్నారు, ఎందుకు రషీద్ కాల్పులు జరిపాడనే చర్చ బాలీవుడ్ సినీ సర్కిల్ లో జరుగుతుంది.
Also read: ప్రియుడుతో ఎంగేజ్ మెంట్ కి సిద్ధమైన నటి.. పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు
రషీద్ ఖాన్ కి వివాదాలు కొత్తేమి కాదు, గతంలో కూడా పలు కేసుల్లో అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. తన స్వీయ నిర్మాణంలో వచ్చిన దేశద్రోహి చిత్రమైతే అత్యంత చెత్త బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా పరిగణించడంతో పాటు మహారాష్ట్రలో అల్లర్లు జరగడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



