Home

»

Latest News

‘కల్కి 2’ సెట్స్‌కి ప్రభాస్.. బాక్సాఫీస్ రికార్డులు ఇక షేక్ అవ్వాల్సిందే!

May 03, 2026

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన 'కల్కి 2898 AD' చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. పార్ట్-1 క్లైమాక్స్‌లో ప్రభాస్‌ను 'కర్ణుడు'గా చూపించి నాగ్ అశ్విన్ ఇచ్చిన ట్విస్ట్ సీక్వెల్‌పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఇప్పుడు 'కల్కి 2'కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రేపటి (మే 4) నుంచి ఈ సీక్వెల్ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. (Kalki Part 2)

హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో 'కల్కి 2' కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. రేపు జరగబోయే నైట్ షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. అమితాబ్ బచ్చన్,  కమల్ హాసన్ లపై ఇప్పటికే కొన్ని సీన్స్ తెరకెక్కించగా.. ప్రభాస్ మొదటిసారి 'కల్కి 2' షూటింగ్ లో పాల్గొంటుండడం విశేషం.

పార్ట్-1 క్లైమాక్స్‌లో ప్రభాస్‌ను 'కర్ణుడి' అవతారంలో చూసిన ప్రేక్షకులకు, పార్ట్-2 లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో షూటింగ్ ప్రారంభం కావడం ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.

'కల్కి 2' నుంచి దీపికా పదుకొణెను తొలగించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో సాయి పల్లవి నటించే అవకాశముంది.

'కల్కి 2'తో పాటు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'ఫౌజీ', 'స్పిరిట్' ఉన్నాయి. ఈ మూడు సినిమాల షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు సమాచారం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com