అధ్యక్షఎన్నికల్లో జానీ మాస్టర్ వైఫ్ సుమలత విజయం..శ్రష్టి వర్మకి షాక్!
on Dec 8, 2025
.webp)
-ఎలా విజయం సాధించాడు
-ఏం జరిగింది!
-ఎన్ని ఓట్లు మెజారిటీ
కొరియోగ్రాఫర్ గా ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ని డైరెక్ట్ చేసారు జానీమాస్టర్(Jani Mater). ఎంతో మంది హీరోల అభిమానులు తమ అభిమాన హీరో సినిమాకి జానీ మాస్టర్ పని చేయాలనీ కోరుకుంటారు. అంతలా తన స్టెప్స్ తో మెస్మరైజ్ చెయ్యగలడు. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న'పెద్ది' లోని 'చికిరి' సాంగ్ జానీ మాస్టర్ కంపోజ్ చేసిందే. రీసెంట్ గా తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య 'సుమలత' అలియాస్ అయేషా అధ్యక్ష పదవికి పోటీ చేసింది. ఆమె ప్రధాన ప్రత్యర్థిగా జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్ పోటీ చేసాడు.
జోసెఫ్ మాస్టర్ కి శేఖర్ మాస్టర్, భానుమాస్టర్, రఘు మాస్టర్, పొల్లకి విజయ్, జోజో శామ్, చంద్రకిరణ్ వంటి సీనియర్ డాన్స్ మాస్టర్లు బహిరంగంగా తమ మద్దతు ప్రకటించారు. అన్నిటికంటే ముఖ్యంగా జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన ప్రముఖ డాన్సర్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ జోసెఫ్ కి మద్దతుగా నిలబడటమే కాకుండా జానీ మాస్టర్ వైఫ్ ని ఎలక్షన్స్ జరుగుతున్నంత సేపు పోలింగ్ జరిగే ఏరియాలోనే ఉండి ఓటర్లని ప్రభావితం చెయ్యడానికి వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.కానీ ప్రత్యర్థులందరికి షాక్ ఇస్తు జానీ మాస్టర్ వైఫ్ ఘన విజయం సాధించింది.
also read: 47 ఏళ్ల హీరోకి జోడిగా సాయి పల్లవి!.. ఫ్యాన్స్ ఏమంటారో మరి
అసోసియేషన్ లో మొత్తం 510 ఓటర్లు ఉండగా, 439 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జానీ మాస్టర్ వైఫ్ కి అత్యధికంగా 228 ఓట్లు రాగా, ప్రత్యర్థి జోసెఫ్ మాస్టర్‌కి 199 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి చంద్రశేఖర్ కి 11 ఓట్లు లభించాయి. దీంతో 29 ఓట్ల మెజారిటీతో జానీ మాస్టర్ వైఫ్ గెలుపొందింది. అసోసియేషన్ లో ఎలాంటి పెద్దల సపోర్ట్ లేకుండా జానీ మాస్టర్ వైఫ్ విజయం సాధించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో జానీ మాస్టర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ గెలుపు జానీ మాస్టర్ గెలుపు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



