.webp)
దేవరతో సత్తా చాటిన జాన్వీ కపూర్(janhvi kapoor)ఇప్పుడు పెద్ది(Peddi)తో తెలుగు నాట తన జెండా పాతాలని అనుకుంటుంది. నిన్న రిలీజైన పెద్ది ట్రైలర్ చూస్తే జెండా పాతేలాగానే ఉంది. పాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా తనకి ఆ హక్కు కూడా ఉందని అభిమానులు చెప్తున్నారు. రీసెంట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో జాన్వీ ఖాయమైంది.
చియాన్ విక్రమ్ ,మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని ఎంపిక చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో జాన్వీ కపూర్‌ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. డైరెక్టర్ మారి సెల్వరాజ్ చెప్పిన కథ, తన క్యారెక్టరైజేషన్ నచ్చడంతో జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also read: Disha Patani: ఆ హీరోయిన్ విడాకులకి దిశా పటానీ కారణమా! మౌనంగా ఉంటే నిజమైపోతుందా!
మారి సెల్వరాజ్ లాంటి వైవిధ్యమైన దర్శకుడితో, ధ్రువ్ విక్రమ్ లాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సరసన సినిమా అంటే జాన్వీ కెరీర్‌కి కోలీవుడ్‌లో కూడా తన హవాని కొనసాగించడానికి అవకాశం దొరికిందని చెప్పవచ్చు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోలీవుడ్ లో కూడా జాన్వీ తన జెండా పాతడం ఖాయమని అభిమానులు అంటున్నారు.






