Home

»

Latest News

Jana nayagan: కేబుల్ టీవీలో జననాయగన్ ప్రసారం.. పళని స్వామినే కారణం 

Apr 14, 2026 10:48AM

 

-జననాయగన్ విషయంలో మరో సంచలనం
-రెండు రోజుల క్రితం పైరసీ కేటుగాళ్లన్నీ పట్టుకున్నారు 
-ఇప్పుడు కేబుల్ టీవీలో ప్రసారం 

ఇళయ దళపతి విజయ్(Vijay)పొలిటికల్ టూర్స్ లో బిజీగా ఉన్నా తన మైండ్ లో మాత్రం జననాయగన్(Jananayagan)పైరసీకి గురైన విషయంలో బాధ మాత్రం ఉంటూనే ఉంటుంది. ఉండదకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే సినిమా పెట్టిన అభిమాన బిక్ష వల్లనే రాజకీయ యవనికపై నిలబడి ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతున్నాడు. రీసెంట్ గా జన నాయగన్ కి సంబంధిచిన మరో న్యూస్ విజయ్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.  

కోయంబత్తూరు సమీపంలోని కరుమత్తంపట్టిలో పళనిసామి అనే వ్యక్తి రాశి కేబుల్ టీవీ అనే లోకల్ ఛానల్ ని నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు మొన్న 11 న నైట్ 21 నిమిషాల పాటు జననాయగన్ లో ఇంటర్వెల్ తర్వాత వచ్చే కీలక సన్నివేశాలని ప్రసారం చేసాడు. ఈ విషయాన్నీ గమనించిన అభిమానులు,టీవీకే(విజయ్) పార్టీ కార్యకర్తలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పళనిసామిని అరెస్ట్ చేసి ప్రసారానికి  వాడిన కంప్యూటర్, హార్డ్ డిస్క్‌లని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కాపీరైట్ యాక్ట్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఫుటేజీ తనకి అందినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. 

Also read: VIshwak sen: దేవరతో కలిసిన విశ్వక్ సేన్.. ఏడేళ్లు ఖాళీగా ఉన్న డైరెక్టర్‌తో కొత్త మూవీ 


రెండు రోజుల క్రితం సుమారు ఐదు నిమిషాల నిడివి గల హై క్వాలిటీతో కూడిన కీలక దృశ్యాలు, పాటలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఇప్పుడు కేబుల్ టీవీ లో 21 నిమిషాల సిసి టీవీ ఫుటేజ్. మరి ముందు ముందు లీక్ కి సంబంధించిన ఎలాంటి న్యూస్ వినాలని వస్తుందేమో అనే భయం ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి  కొన్ని రోజుల నుంచి నిత్యదిన చర్యలో ఒకటిగా మారింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com