
చాలా రోజుల తర్వాత అచ్చ తెలుగు సినిమాని మురిసిపోయేలా చేసిన మూవీ ఇరుముడి. వయసు లింగ బేధం తేడా లేకుండా ట్రాక్టర్లు,ఎడ్ల బళ్ళలో సైతం థియేటర్స్ కి వెళ్ళి టికెట్స్ కోసం గొడవ పెట్టుకున్నారంటే ఇరుముడి ఏ స్థాయి విజయమో అర్ధం చేసుకోవచ్చు. 200 కోట్ల మార్కుని దాటి షికారు చేస్తున్న ఇరుముడి ఓటిటికి సంబంధించిన ఆసక్తికర చర్చ సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో జరుగుతుంది.
ఓటిటి హక్కులని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ నెల 18న రావాల్సి ఉంది. కానీ థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటంతో, ఓటీటీ రిలీజ్‌ను మరికొన్ని వారాలు ఆలస్యం చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రొడ్యూసర్లు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యంతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. 4 వారాల నుంచి 6 లేదా 8 వారాలకు పొడిగించే ఆలోచనలో ఉన్నట్లుగా నిర్మాతల నిర్మాణమని టాక్. అదే జరిగితే ఈ నెలలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉండదు. ఏది ఏమైనా రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.
.webp)
Also Read: మారిపోయిన 'డీసీ' భామ జీవితం: హిట్ వస్తే ఎవరికైనా అదే పరిస్థితి!
[ Irumudi, Raviteja, Priya Bhavani Shankar, Nakshtra, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood ]






