ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కళ్యాణ్ రామ్
on May 2, 2021
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కి 'జనతా గ్యారేజ్' వంటి సెన్సేషనల్ హిట్‌ని అందించిన హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం ఆయన అన్న నందమూరి కళ్యాణ్ రామ్‌తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుని నిర్మిస్తోంది. రాజేంద్ర అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంతమేర చిత్రీకరణ పూర్తయ్యింది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి 'అమిగోస్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ఫిక్స్ చేశారని టాక్. స్పానిష్‌లో 'అమిగోస్' అంటే స్నేహితులు అని అర్థం. మరి.. కళ్యాణ్ రామ్ చిత్రంలో ఆ స్నేహితులు ఎవరో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. త్వరలోనే కళ్యాణ్ రామ్ - మైత్రీ మూవీ మేకర్స్ కాంబో మూవీకి సంబంధించి టైటిల్ పై క్లారిటీ వస్తుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా జనం ముందుకు రానుంది.
కాగా, 'పటాస్' తరువాత సరైన విజయం లేని కళ్యాణ్ రామ్‌కి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకంగా మారింది. సందర్భవశాత్తూ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సొంత బ్యానర్ పేరు అమిగోస్ క్రియేషన్స్.
Also Read