
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత హోదాలో హైదరాబాద్ లో మాట్లాడుతు 'తెలంగాణలో కూడా తమ పార్టీని విస్తరిస్తామని, రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన రాజకీయంగా పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి 'రండి దొర.. మీరొస్తానంటే మేమొద్దంటామా? కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి అంటు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.
ప్రకాష్ రాజ్ చేసిన ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై నటి హేమ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసారు. అందులో ఆమె మాట్లాడుతు ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానాలని, ప్రభుత్వ నిర్ణయాలని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి దూషణలకి దిగడం ఎంతవరకు సమంజసం. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయగానే మీకు ఎక్కడి లేని ఉత్సాహం, మూడ్ వచ్చేస్తుందా!.పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించండి. కానీ వ్యక్తిత్వ హననానికి దిగకండి. అయన వ్యక్తిత్వం గురించి కోట్లాది మందికి తెలుసు. గతంలో ఇలాంటి విమర్శలు చేసిన వారు ఏమయ్యారో చరిత్రలో చూసుకోండి అంటూ ప్రకాష్ రాజ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. హేమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రముఖ నిర్మాత, పవన్ ఆప్తుడు బండ్ల గణేష్ కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ ని తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.






