
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohanlal),దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph)ల దృశ్యం 3(Drishyam 3) సరికొత్త చరిత్రని సృష్టించే విధంగా దుకుకెళ్తుంది. సరిగ్గా వారం క్రితం మే 21 న విడుదలైన ఈ మూవీ రికార్డులే తన లక్ష్యం అన్నట్టుగా 7 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. చిత్ర బృందం కూడా సదరు కలెక్షన్స్ పై ఒక మలయాళ చిత్రం ఈ స్థాయిలో వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా ప్రభావం చూపించడం ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరుస్తోంది.
జార్జ్‌కుట్టి, అతని కుటుంబం చుట్టూ తిరిగే ఈ భావోద్వేగపూరిత క్రైమ్ థ్రిల్లర్ ప్రయాణం థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతోంది. ఈ అద్భుతమైన విజయంపై మోహన్‌లాల్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. "మూడు సినిమాలు.. మూడు అధ్యాయాలు.. ఒక విడదీయరాని బంధం. జార్జ్‌కుట్టి మరియు అతని కుటుంబంతో కలిసి ప్రయాణించినందుకు అందరికీ ధన్యవాదాలు" అంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ద్వారా ఈ ఫ్రాంచైజీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'దృశ్యం 3' సరికొత్త రికార్డుని నెలకొల్పింది. మోహన్‌లాల్ కెరీర్‌లో ఇప్పటికే 'L2: ఎంపూరాన్', 'తుడరుమ్' వంటి చిత్రాలు .200 కోట్ల మార్కును అందుకోగా, ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక జాబితాలోకి ఈ సినిమా కూడా చేరిపోయింది.
ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలను నిశితంగా గమనిస్తే, ఏడో రోజైన బుధవారం కూడా ఇండియాలో 6.65 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఈ సినిమా తన సత్తా చాటింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.75.30 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ.87.38 కోట్లను తాకాయి. ప్రపంచవ్యాప్తంగా బుధవారం రోజున 4,721 షోలలో ఈ సినిమా ప్రదర్శితమైంది. కేవలం మలయాళ వెర్షన్ నుంచే ఏడో రోజున .5.85 కోట్ల నెట్ వసూళ్లు రాగా, 40.35 శాతం థియేటర్ అక్యుపెన్సీ నమోదైంది. ఇతర భాషల విషయానికి వస్తే, తెలుగు వెర్షన్ రూ.50 లక్షలు (14.19% అక్యుపెన్సీ), తమిళ వెర్షన్ రూ.20 లక్షలు (17.09% అక్యుపెన్సీ), కన్నడ వెర్షన్ రూ.10 లక్షల వసూళ్లను సాధించాయి.
Also read: Peddi: హైకోర్టుని ఆశ్రయించిన పెద్ది నిర్మాత.. ఇక సినీ ఆట మొదలైనట్లేనా!
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా జార్జ్‌కుట్టి హవా గట్టిగానే నడుస్తోంది. బుధవారం ఒక్క రోజే 5 కోట్ల గ్రాస్ వసూలు అయ్యాయి. దీంతో ఓవర్సీస్ కలెక్షన్లు .95.70 కోట్లకి చేరాయి. దేశీయ, అంతర్జాతీయ వసూళ్లను కలుపుకుని కేవలం 7 రోజుల్లోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ .200 కోట్ల మార్కును విజయవంతంగా అధిగమించింది. మరి ఈ లెక్కన 300 కోట్లు పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.






.webp)
