విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌తో దిల్ రాజు మూవీ!
on May 3, 2021
రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్లో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్న దిల్ రాజు లేటెస్ట్గా తమిళ సూపర్‌స్టార్ విజయ్‌తో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తయారయ్యే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడనేది సమాచారం. ఇటీవల విజయ్ను కలిసి వంశీ స్టోరీ వినిపించాడనీ, విజయ్‌కు ఆ స్క్రిప్ట్ బాగా నచ్చి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది.
అతి త్వరలోనే విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీని దిల్ రాజు అనౌన్స్ చేస్తాడని అంటున్నారు. శంకర్-రామ్‌చరణ్ సినిమాకు ఎలాగైతే బిగ్ బడ్జెట్‌ను కేటాయించారో, అలాగే ఈ బైలింగ్యువల్ మూవీకి కూడా బిగ్ బడ్జెట్‌ను ఆయన కేటాయించారని తెలుస్తోంది.
ఇటీవలే పవన్ కల్యాణ్‌తో నిర్మించిన 'వకీల్ సాబ్'తో దిల్ రాజు బాగా ఆదాయం గడించారు. థియేట్రికల్ రిలీజ్ పరంగానే కాకుండా డిజిటల్ రిలీజ్ పరంగానూ ఆయనకు మంచి ప్రాఫిట్స్ లభించాయి. శాటిలైట్ రైట్స్‌తో ఆయనకు మరింత ఆదాయం చేకూరింది. ప్రస్తుతం ఆయన క్రేజీ కాంబినేషన్స్ మీద దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది.