నాని చిత్రంలో కన్నడ హీరో!
on Sep 23, 2021
నేచురల్ స్టార్ నాని మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి నిర్మాత కూడా. `అ!` (2018), `హిట్` (2020) చిత్రాలతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్న నాని.. ప్రస్తుతం తన సోదరి దీప్తి ఘంటాని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఓ సినిమాని నిర్మిస్తున్నారు. `మీట్ క్యూట్` పేరుతో తెరకెక్కుతున్న ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
ఇదిలా ఉంటే.. ఆంథాలజీగా రూపొందుతున్న `మీట్ క్యూట్`లో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. `దియా` (2020) అనే రొమాంటిక్ డ్రామాతో కన్నడనాట పాపులర్ అయిన దీక్షిత్.. ఇటీవల శ్రీనివాసరెడ్డితో కలిసి `ముగ్గురు మొనగాళ్ళు` అనే తెలుగు చిత్రంలో నటించాడు. `మీట్ క్యూట్` తనకి రెండో తెలుగు సినిమా కానుంది. ఇందులో `మళ్ళీ రావా`, `దేవదాస్` చిత్రాల్లో నాయికగా నటించిన ఆకాంక్ష సింగ్ కి జోడీగా దర్శనమివ్వనున్నాడు దీక్షిత్.
మరి.. `మీట్ క్యూట్`తో దీక్షిత్ తెలుగునాట నటుడిగా మరింత గుర్తింపు దక్కించుకుంటాడేమో చూడాలి. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో `మీట్ క్యూట్` రిలీజ్ కానుంది.
Also Read