‘డాకు మహారాజ్ మనిషి కాదు.. వైల్డ్ యానిమల్’.. శత్రువులకు దడ పుట్టిస్తున్న బాలయ్య!
on Jan 10, 2025
ఈ సంక్రాంతికి మూడు సినిమాలు బరిలో ఉన్న విషయం తెలిసిందే. వాటిలో శుక్రవారం రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అయింది. రెండో సినిమా నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఆదివారం రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచింది. బాలయ్యకు ఇది మరో డిఫరెంట్ మూవీ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు అభిమానులు. తాజాగా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ ఆ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది. శుక్రవారం ‘డాకు మహారాజ్’కి సంబంధించిన రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మొదట రిలీజ్ అయిన ట్రైలర్‌ను మించి ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఈ ట్రైలర్‌లో బాలయ్య రెండు షేడ్స్‌లో కనిపించినా ఎక్కువగా డాకు మహారాజ్‌కి సంబంధించిన సీన్స్‌తోనే నడిచింది. ముఖ్యంగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ తప్పకుండా థియేటర్‌లో విజిల్స్ వేయిస్తాయి అనిపిస్తోంది. ‘హమ్‌కో దుష్మన్ కమ్.. జాన్ దేనేవాలే ఫ్యాన్స్ జాదా హై’, ‘రాయలసీమ మాలూమ్ తేరేకో.. ఓ మేరా అడ్డా..’, ‘ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో.. నేను చంపడంలో చేశా.. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్’ వంటి డైలాగ్స్ చాలా హై ఓల్టేజ్‌లో ఉన్నాయి. ట్రైలర్‌లోనే బాలయ్య మార్క్ డైలాగ్స్ అన్ని ఉన్నాయంటే.. సినిమాలో ఇంకెన్ని ఉంటాయో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎమోషనల్‌గా డైలాగ్స్ చెప్పడంలోనే కాదు, యాక్షన్ సీన్స్‌లోనూ బాలకృష్ణ విభిన్నంగా కనిపించారు. బాబీ టేకింగ్ బాలయ్యను మరింత కొత్తగా చూపించేలా ఉంది. ఇక థమన్ మ్యూజిక్ ప్రతి సీన్‌ని బాగా ఎలివేట్ చేసేలా ఉంటుందనిపిస్తోంది. టోటల్‌గా రిలీజ్ ట్రైలర్ మాత్రం సినిమాకి ఉన్న హైప్‌ని రెట్టింపు చేసిందని చెప్పాలి.