Home

»

Latest News

'పెద్ది' బ్లాక్‌బస్టర్ సక్సెస్.. టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి!  

Jun 12, 2026 7:40PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇటీవల థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మొదటి ఆట నుండే ఈ సినిమాకు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ సాధించిన ఘన విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ గా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందిస్తూ ఆయన కురిపించిన ప్రశంసల జల్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  

మెగాస్టార్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ.. ప్రస్తుతం తాను తమిళనాడులోని పొల్లాచ్చి పరిసర ప్రాంతాలలో తన రాబోయే చిత్రం 'మెగా 158' షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన మనసంతా ‘పెద్ది’ సినిమా విజయం పైనే ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ గత రెండేళ్లుగా పడ్డ కష్టాన్ని, ఆయన చూపించిన డెడికేషన్ ను తాను స్వయంగా చూశానని చిరు పేర్కొన్నారు. ఒక తండ్రిగానే కాకుండా తోటి నటుడిగా చరణ్ పర్ఫార్మెన్స్ చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని ఎమోషనల్ అయ్యారు.  

సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ పడిన తపన, శ్రమ స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఈ భారీ విజయం ఆయన కష్టానికి దక్కిన సరైన ప్రతిఫలమని చిరంజీవి కొనియాడారు. కేవలం చరణ్‌ను మాత్రమే కాకుండా ఈ అద్భుతమైన కథను వెండితెరపై ఎంతో ప్రతిభావంతంగా ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సనాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి భారీ ప్రాజెక్టును ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు మేకింగ్ వాల్యూస్ ను కూడా మెగాస్టార్ మెచ్చుకున్నారు.

ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లతో పాటు దివ్యేందు నటనను కూడా చిరు అప్రిషియేట్ చేశారు. సాంకేతిక విభాగంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆర్. రత్నవేలు విజువల్స్, కొల్లా అవినాష్ ఆర్ట్ వర్క్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని ప్రశంసించారు. ఈ సినిమా సమిష్టి కృషి వల్లే ఇంతటి ఘనవిజయాన్ని సాధించిందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం కొనసాగుతోంది. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల మైలురాయిని దాటే దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో కూడా చరణ్ సోలో హీరోగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. మెగాస్టార్ నుండి వచ్చిన ఈ అభినందనల పోస్ట్‌తో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. రాబోయే రోజుల్లో ఈ స్పోర్ట్స్ డ్రామా మరిన్ని భారీ వసూళ్లను సాధించి టాలీవుడ్ లో ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com