
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ 'చెన్నై లవ్ స్టోరీ'తో స్టీవెన్ ,నివిగా అదిరిపోయే పెర్ఫార్మ్ ఇచ్చి ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తున్నారు. మూవీ చూసిన వాళ్లేమో ఆ ఇద్దరు సృష్టించిన 'ఓరా' నుంచి బయటకి రావడానికి టైం పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా తన హవా కొనసాగిస్తోంది.
ఈ ఘన విజయం నేపథ్యంలో ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని చిత్ర బృందానికి ప్రత్యేకంగా గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇచ్చారు. కేక్ కట్ చేసి చిత్ర యూనిట్‌ని అభినందించిన ఈ వేడుకలో హీరో సుశాంత్, ప్రముఖ దర్శకులు చందూ మొండేటి, కరుణ కుమార్ తదితరులు హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సస్పెన్స్, లవ్ అండ్ ఎమోషన్‌ని సరైన విధంగా అందిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ గుండెల్లో నిలుపుకుంటారని మరొకసారి రుజువు చేసింది.
Also read: ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కింగ్ ఈ హీరోనా!
మూడు రోజుల్లో 40 .01 కోట్ల గ్రాస్ సాధించినట్టు చిత్ర బృందం అధికారంగా ప్రకటించింది. దీంతో మరికొన్ని రోజుల్లో యాభై కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. 'బేబి' దర్శకుడు సాయి రాజేష్ కథ అందించగా, ఎస్కేఎన్ తో కలిసి నిర్మాతగా వ్యవహరించాడు. రవి నంబూరి దర్శకుడిగా పరిచయమవగా, ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. తెలుగు రాష్ట్రాల్లో చెన్నై లవ్ స్టోరీ' ని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది.
#Chennai Lovestory #KIranabbavaram #sri Gouri priya
.webp)






